చిత్తూరు: జిల్లాలో బుధవారం ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగలన్నీ గుంపులుగా వచ్చిగుడిపల్లి మండలం సంగనపల్లి ఎం కొత్తూరూ, కోడిగానిపల్లి, చిన్నగొల్లపల్లి గ్రామ శివారులోని పంటపోలాలపై దాడులు చేశాయి. భయంకరంగా ఘీంకారాలు చేస్తూ పంట పోలాలను ధ్వంసం చేశాయి. దీంతో సమీప గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖా అధికారులు స్పందించి గ్రామస్తులను ఇళ్లల్లోంచి బయటకు రావద్దంటూ దండోరా వేయిస్తున్నారు. కాగా, కుప్పం వేపనపల్లి మార్గంలో రాకపోకలను పోలీసులు నిలిపివేసినట్టు సమాచారం.
చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం
Published Wed, Dec 25 2013 8:02 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement
Advertisement