గద్వాల, న్యూస్‌లైన్: ఆర్డీఎస్ (రాజోలిబండ నీటి మ ళ్లింపు పథకం) చివరి ఆయకట్టుకు నీ ళ్లను అందించేలా ప్రతిపాదించిన తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రాథమిక స ర్వేను జూరాల ఎస్‌ఈ ఖగేందర్ గురువారం సమీక్షించి తిరస్కరించారు. నది లో నీటిమట్టం, పంప్‌హౌస్ లెవల్స్, ఆ ర్డీఎస్ ప్రధాన కాల్వలో నీటి నిల్వమ ట్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ సర్వే నిర్వహించాలని ఆ ర్డీఎస్ ఇంజనీర్లను ఎస్‌ఈ ఆదేశిం చారు. పది రోజుల్లోగా సర్వేపనులను పూర్తిచేయాలని సూచించారు. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా మాన్వి నియోజకవర్గంలో తుంగభద్ర నదిపై నిజాం కాలంలో నిర్మించిన ఆర్డీఎస్ ద్వారా, ప్రస్తుత అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది.
30 ఏళ్లుగా ఆయకట్టు తగ్గుతూ ప్రస్తుతం 25వేల ఎకరాలకు కుదిరించారు. ఆర్డీఎస్ ఎగువ ప్రాంతంలోని 25వేల ఎకరాలకు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి నీళ్లు అందుతుండగా, చివర ఉన్న 25వేల ఎకరాలకు జూరాల కుడికాల్వ లింకు ద్వారా సాగునీరు అందిస్తున్నారు. మధ్యలో ఉన్న 37 వేల ఎకరాలకు దశాబ్దాలుగా నీరు అందడం లేదు. ఇలా మధ్యలో మిగిలిపోయిన వడ్డేపల్లి, మానవపాడు మండలాల్లోని ఆయకట్టుకు నీళ్లందించేందుకు తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతల చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించాల్సిందిగా ఆర్డీఎస్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశారు. గత ఏప్రిల్ నుంచి ప్రాథమిక సర్వే పనులు చేపట్టిన అధికారులు ఆలస్యంగా ఎట్టకేలకు పూర్తిచేసి గురువారం గద్వాల ఎస్‌ఈ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ ప్రాథమిక సర్వేను పరిశీలించిన జూరాల ఎస్‌ఈ ఖగేందర్ నీటిమట్టాలకు సంబంధించిన పొరపాట్లను సవరించి మరోసారి సర్వేను తయారు చేయాల్సిందిగా తిరస్కరించారు.
పదిరోజుల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాథమిక సర్వేను పూర్తి చేయాల్సిందిగా ఆర్డీఎస్ ఇంజనీర్లను కోరారు. సర్వేపనులు త్వరగా పూర్తిచేసి ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం కర్ణాటకలో నీటి విడుదల పెరిగినందున వచ్చే డిసెంబర్ నాటికి ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌తోపాటు, ప్యాకేజీ -1,2లలో పనులు చేపట్టే విధంగా కర్ణాటకతో సంప్రదింపులు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు.
పొరపాట్లను సవరించాలి
Published Fri, Sep 6 2013 5:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement