సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు.
సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. పార్టీలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాటలోనే నడిస్తే రాష్ట్రం ముక్కలు కాదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ రామచంద్రరావు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరాయి. అలాగే, సమైక్యాంధ్రకు మద్దతుగా నూజివీడులో మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 14వ రోజుకు చేరాయి.