రాయల తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించడంపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి హర్షం ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: రాయల తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ అధికారులు కొందరు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించడంపై మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి హర్షం ప్రకటించారు. కర్నూలు, అనంతపురంను కొత్త రాష్ట్రంలో కలిపే విషయమై తెలంగాణ ప్రాంత నేతలెవరికీ అభ్యంతరం లేదన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజనను అడ్డుకోవడం ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదని.. ఒక్క అమ్మ (కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ) చేతుల్లోనే ఉందన్నారు. ‘అమ్మ ఎస్ అంటే ఎస్. నో అంటే నో’ అని వ్యాఖ్యానించారు.