రాష్ట్రంలో రాక్షసపాలన
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
సంజామల: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని వైఎస్సార్సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. సంజామలలోని వనం వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రాంగణంలో మంగళవారం వైఎస్సార్సీపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిచిన్న పనుల్లోనూ కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎమ్మెల్యేల నుంచి కార్యకర్తల వరకూ జేబులు నింపుకోవాలనే ధోరణి తప్ప అభివృద్ధిపై వారికి ధ్యాస లేదని విమర్శించారు. సీఎంకు బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఓర్పు, సహనంతో రెండేళ్లు వేచిచూస్తే మంచిరోజులు వస్తాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. సమావేశంలో కేడీసీసీ మాజీ చైర్మన్, పార్టీరాష్ట్ర కార్యదర్శి గుండం వెంకటసూర్యప్రకాష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు డి.చిన్నబాబు.ఎంపీపీ గౌరుగారి ఓబుల్‌రెడ్డి, ఎస్సీసెల్ జిల్లా కార్యవర్గసభ్యులు ఎస్సీబాబు, ముక్కమల్ల సర్పంచ్ పోచా వెంకట్రామిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు.