యలమంచిలి, న్యూస్‌లైన్ :విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా 3 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కొద్దిసేపు రేగుపాలెం రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం ఉదయం గం.5.30ల నుంచి 6గంటలవరకు రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయింది. రైలు నర్సీపట్నంరోడ్డుస్టేషన్ దాటగానే గ్రిడ్ ఫెయిల్ కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇంజిన్ స్టోరోజ్‌లో ఉన్న విద్యుత్ ద్వారా రేగుపాలెం రైల్వేస్టేషన్‌కు తీసుకువచ్చారు. కాగా భువనేశ్వర్‌నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్సెప్రెస్ ఉదయం 5.40 నుంచి 6గంటలవరకు, గరీబ్ధ్ ్రఎక్స్‌ప్రెస్ ఉదయం 8.11ల నుంచి 8.17వరకు రేగుపాలెం రైల్వేస్టేషన్‌లో నిలిచిపోయాయి. ప్రయాణికులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో ఆయా రైళ్లు కదిలాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.