నేటి నుంచి రైళ్లలో అదనపు కోచ్‌లు | Extra coaches on trains from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైళ్లలో అదనపు కోచ్‌లు

Published Wed, Jun 17 2015 6:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

Extra coaches on trains from today

విజయవాడ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బుధవారం నుంచి ఈ నెల 30 వరకు కొన్ని రైళ్లలో అదనంగా 3వ ఏసీ, స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 17256/17255 (హైదరాబాద్-నర్సపూర్-హైదరాబాద్), 17230/17229 (హైదరాబాద్-త్రివేండ్రం-హైదరాబాద్), 17643/17644 (చెన్నై ఎగ్మూర్-కాకినాడ-చెన్నై ఎగ్మూర్) ఎక్స్‌ప్రెస్‌లకు 3వ ఏసీ కోచ్‌ను ఒక్కొక్కటి చొప్పున అదనంగా కలుపుతారు.

ఈ రైళ్లలో మూడు ఏసీ కోచ్‌లుంటాయి. 17016/17249 (సికింద్రాబాద్-మచిలీపట్నం-సికింద్రాబాద్), 17250/17249 (సిక్రిందాబాద్-మచిలీపట్నం-సికింద్రాబాద్), 1740/17402 (తిరుపతి-మచిలీపట్నం-నర్సపూర్), 17206/17205 (కాకినాడ టౌన్- షిర్డీనగర్-కాకినాడ), 17204/17203 (కాకినాడ టౌన్-భావనగర్-కాకినాడ)  ఎక్స్‌ప్రెస్‌కు ఒక స్లీపర్ కోచ్‌లను అదనంగా కలుపుతారని విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్‌ఓ ఎఫ్.ఆర్.మైఖేల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement