extra coaches
-
శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు ‘అనుభూతి’ బోగి!
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్–పుణే మధ్య తిరిగే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రత్యేక ఆకర్షణ తోడయింది. భారతీయ రైళ్లలో లగ్జరీ కోచ్‌లుగా పేరొందిన ‘అనుభూతి’బోగీని ఈ రైలుకు జత చేయనున్నారు. సోమవారం నుంచి ఒక అనుభూతి బోగీని శాశ్వత ప్రాతిపదికన శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌కు జోడించనున్నారు. శతాబ్ది బోగీలతో పోలిస్తే ఇది చాలా విలాసంగా ఉంటుంది. ప్రతి సీటుకు ఎల్సీడీ మానిటర్లు ఉంటాయి. సీటుకు సీటుకు మధ్య కాళ్లు పెట్టుకునేందుకు విశాలమైన స్థలం, కిటికీ అద్దాలకు ప్రత్యేక తెర ఉంటుంది. శతాబ్ది ఏసీ–1 చైర్‌కార్‌లో 56 సీట్లుండగా.. ఈ లగ్జరీ బోగీలో 50 సీట్లు ఉంటాయి. ఏసీ–1 బోగీ టికెట్ ధర కంటే అనుభూతి టికెట్ ధర ఎక్కువగా ఉంటుంది. ఒక్కో బోగీ తయారీకి దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుండటంతో వీటిని తక్కువ సంఖ్యలో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్–పుణే శతాబ్దికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ లగ్జరీ బోగీని అనుసంధానిస్తున్నారు. -
‘వెయిటింగ్ లిస్ట్ ఉన్నా బెర్తు ఖాయం’
గుంటూరు: సంక్రాంతి రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనుంది. మొత్తం ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్లను అదనపు బోగీలతో ఈ నెలాఖరు వరకు నడపనున్నట్లు గుంటూరు రైల్వే సీనియర్ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. గుంటూరు-వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా ఏసీ చైర్‌కార్, సెకండ్ సిట్టింగ్ కోచ్, హైదరాబాద్-నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు ఏసీ త్రీ టైర్ కోచ్, సికింద్రాబాద్-విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు రెండు సెకండ్ సిట్టింగ్ కోచ్‌లను జతచేసి నడపనున్నారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారందరికీ బెర్తుల కేటాయింపు జరుగుతుందన్నారు. -
నేటి నుంచి రైళ్లలో అదనపు కోచ్‌లు
విజయవాడ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని బుధవారం నుంచి ఈ నెల 30 వరకు కొన్ని రైళ్లలో అదనంగా 3వ ఏసీ, స్లీపర్ కోచ్‌లను ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. 17256/17255 (హైదరాబాద్-నర్సపూర్-హైదరాబాద్), 17230/17229 (హైదరాబాద్-త్రివేండ్రం-హైదరాబాద్), 17643/17644 (చెన్నై ఎగ్మూర్-కాకినాడ-చెన్నై ఎగ్మూర్) ఎక్స్‌ప్రెస్‌లకు 3వ ఏసీ కోచ్‌ను ఒక్కొక్కటి చొప్పున అదనంగా కలుపుతారు. ఈ రైళ్లలో మూడు ఏసీ కోచ్‌లుంటాయి. 17016/17249 (సికింద్రాబాద్-మచిలీపట్నం-సికింద్రాబాద్), 17250/17249 (సిక్రిందాబాద్-మచిలీపట్నం-సికింద్రాబాద్), 1740/17402 (తిరుపతి-మచిలీపట్నం-నర్సపూర్), 17206/17205 (కాకినాడ టౌన్- షిర్డీనగర్-కాకినాడ), 17204/17203 (కాకినాడ టౌన్-భావనగర్-కాకినాడ) ఎక్స్‌ప్రెస్‌కు ఒక స్లీపర్ కోచ్‌లను అదనంగా కలుపుతారని విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్ఓ ఎఫ్.ఆర్.మైఖేల్ తెలిపారు. -
పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు
హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి బయలుదేరే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు స్లీపర్ బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. విశాఖ, మచిలీపట్నం, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 5వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు ఈ తాత్కాలిక అదనపు బోగీల సౌకర్యం ఉంటుందని పేర్కొంది. ఈ అదనపు బోగీల వల్ల 4752 బెర్తులు అందుబాటులోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. -
32 ఎక్స్ ప్రెస్ రైళ్లలో అదనపు బోగీల ఏర్పాటు
హైదరాబాద్:దసరా పండుగ రద్దీ దృష్ట్యా ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. అదనంగా ఎక్స్ ప్రెస్ రైళ్లలో 32 అదనపు బోగీల ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో 19, 224 బెర్తులు అందుబాటులోకి రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం, చెన్నై, బెంగళూర్, షిర్డీ, యశ్వంత్ పూర్ వెళ్లే రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు కసరత్తులు చేస్తున్నామన్నారు.