అధికారులతో సమావేశం నిర్వహిస్తున్న కలెక్టర్ వినయ్‌చంద్
ఒంగోలు అర్బన్: కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బందికి, ఏజెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తీసుకోవాల్సి మౌలిక వసతులపై ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూములో గురువారం జిల్లా అధికారులు, కౌంటింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైజ్, పేస్ కాలేజీల్లోని కౌంటింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలన్నారు.
ఇంటర్‌నెట్, వైఫై ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్‌కు అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుధ్యం పనులతో పాటు సిబ్బందికి ఏజెంట్లకు మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సిబ్బందిని కౌంటింగ్ కేంద్రాలకు తీసుకువెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు, సిబ్బందికి అల్పాహారం, భోజనం ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి, రవాణాశాఖ ఉప కమిషనర్ సుబ్బారావు, ప్రత్యక కలెక్టర్ చంద్రమౌళి, డీఆర్‌ఓ వెంకటసుబ్బయ్య, సీపీఓ వెంకటేశ్వర్లు, స్టెప్ సీఈఓ రవి, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment