కౌలు రైతు ఆత్మహత్య | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

కౌలు రైతు ఆత్మహత్య

Published Fri, Oct 30 2015 4:42 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits suicide

పాములపాడు (కర్నూలు) : పెట్టుబడికి తెచ్చిన అప్పు తీర్చే దారి కానరాక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పాములపాడు మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న తులసీ నాయక్ గ్రామానికి చెందిన రైతు నుంచి 25 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నాడు.

ఈ క్రమంలో గింజలు సరిగ్గా మొలకెత్తకపోవడంతో.. రెండోసారి విత్తనాలు నాటాడు. అయినా ఆశించిన స్థాయిలో పంట లేకపోవడంతో.. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ. 5 లక్షల అప్పుతో పాటు భూమి గుత్తకు తీసుకున్న రూ. 4 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement