చింతకొమ్మదిన్నె (వైఎస్సార్ జిల్లా) : పంటల సాగుకు చేసిన అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతన్న ఆత్మహత్య చేసుకున్నాడు. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం లింగారెడ్డిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి(37)కి ఐదెకరాల పొలం ఉంది. పొలంలో ఈ ఏడాది పసుపు, వేరుశెనగ సాగు చేశాడు. వర్షాభావంతో నీటి ఎద్దడి ఏర్పడింది.
దీంతో వేసిన రెండు బోర్లు కూడా వృథా అయ్యాయి. పంటల పరిస్థితి బాగోలేకపోవటంతోపాటు రూ.12 లక్షల అప్పులు తీరేదెలాగని మధన పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. పొలానికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి వచ్చేసరికి విగతజీవిగా పడి ఉన్నాడు. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అన్నదాత బలవన్మరణం
Published Thu, Nov 5 2015 5:58 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement