‘తూడు’పుఠాణి | farmers are facing problems | Sakshi
Sakshi News home page

‘తూడు’పుఠాణి

Published Fri, Jan 10 2014 3:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM

‘తూడు’పుఠాణి

‘తూడు’పుఠాణి

 కాలువల నిండా పేరుకుపోరుున గుర్రపుడెక్క, తూడు
 సాగునీరు అందక నిలిచిన దాళ్వా నాట్లు
 కలుపుమందు పిచికారీ చేసి చేతులు దులుపుకుంటున్న కాంట్రాక్టర్లు
 శ్రమదానంతో తూడును తొలగించుకుంటున్న రైతులు
 
 అత్తిలి, న్యూస్‌లైన్ :
 పంట కాలువల్లో ఎక్కడికక్కడ గుర్రపుడెక్క, తూడు పేరుకుపోతున్నారుు. వాటిని తొలగించే పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. కాంట్రాక్ట్ పొందిన వారు అక్కడక్కడా కలుపు నివారణ మందును పిచికారీ చేరుుంచి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనివల్ల గుర్రపుడెక్క, తూడు అప్పటికప్పుడు నాశనమైనట్టు కనిపిస్తున్నా.. 15 నుంచి 20 రోజుల్లో తిరిగి పెద్దఎత్తున పేరుకుపోతున్నాయి. సాగునీటి ప్రవాహానికి ఆటంకంగా మారుతున్నా యి. ఫలితంగా లక్షలాది రూపాయలు వెచ్చించినా రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలగటం లేదు. ఇదేమని అడిగితే తక్కువ ధరకు టెండర్లు వేస్తున్నారని, అందుకే పూర్తిగా పనులు చేయలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు.
 
 ఇదో ఉదాహరణ తూడు, గుర్రపుడెక్క తొలగించకపోవడంతో అత్తిలి మండలం పాలి ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. గుమ్మంపాడు లాకుల సమీపంలో మొదలయ్యే కె.సముద్రపుగట్టు ఛానల్ ద్వారా పాలి, మంచిలి, దంతుపల్లి ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతోంది. అత్తిలి కాలువలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కె.సముద్రపుగట్టు ఛానల్‌లో గుర్రపుడెక్క, తూడు, కర్ర నాచు విపరీతంగా పెరిగిపోవటం వల్ల నీటి ప్రవాహం ముందుకు సాగటం లేదు. దీనివల్ల దాళ్వా నాట్లకు ఆటంకం ఏర్పడింది.
 బ్రాంచి కెనాల్స్‌లోనూ ఇదే పరిస్థితిఅత్తిలి సెక్షన్ పరిధిలో 10 బ్రాంచి కాలువలు ఉన్నాయి. ఖరీఫ్, రబీ పంటలకు సాగునీటి సరఫరాలో ఆటంకం కలగకుండా చూసేందుకు వాటిలో పేరుకుపోరుున తూడు, కర్రనాచును తొలగించే పనులకు ఇరిగేషన్ అధికారులు టెండర్లు పిలిచారు. ఈడూరుకు చెందిన కాంట్రాక్టర్ రూ.8 లక్షలకు ఈ పనులను దక్కించుకున్నారు. తూడుపై కలుపు నివారణ మందును పిచికారీ చేసి చేతులు దులుపుకున్నాడు. చనిపోయిన తూడు కాలువలో అలాగే ఉండటంతో నీటి ప్రవాహానికి ఆటకం ఏర్పడింది. ఇది తిరిగి మొలకెత్తుతోంది. దీంతో కాలువ శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీరు సరఫరా కావడం లేదు.
 
 ఏటా శ్రమదానం చేయూల్సిందే...
 గుర్రపుడెక్క, తూడు తొలగింపు పనులు సక్రమంగా జరగకపోవడంతో రైతులు ఏటా శ్రమదానం చేసి వాటిని తొలగించే పనులు చేసుకుంటున్నారు. అత్తిలి మండలం పాలి గ్రామానికి చెందిన రైతులు ఇదే పనిలో నిమగ్నమయ్యూరు. దాళ్వా నాట్లకు సమయం మించిపోవడంతో 70 మంది రైతులు గురువారం శ్రమదానం చేసి తూడు, నాచును తొలగించారు. ఈ ఛానల్ పరిధిలో ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతోందని, తామే శ్రమదానంతో తూడును తొలగించుకుంటున్నామని పలువురు రైతులు చెప్పారు. కాలువ ఎగువ ప్రాంతంలోని కోళ్లఫారాల్లో  చనిపోయిన కోళ్లను, వ్యర్థాలను కాలువలో పడవేయడంతో అవి పలుచోట్ల అడ్డుపడి నీరు దిగువకు పారడం లేదని వాపోయారు.
 
 సాగునీరు సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్షలాది రూపాయలను వెచ్చిస్తున్నప్పటికీ పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. కె సముద్రపుగట్టు ఛానల్ ద్వారా పాలి ఆయకట్టులో 2 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. నీరు పారకపోవడంతో దమ్ములు నిలిచిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల సార్వాసాగు జాప్యమైందని, ఇప్పుడు సరఫరా సక్రమంగా లేక దాళ్వాసాగు కూడా ఆలస్యం అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ఆధునీకరణ పనులలో భాగంగా కాలువలను ముందుగానే మూసివేస్తామని అధికారులు పేర్కొంటున్నారని, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, ముందే నీరు నిలిపివేయటం వల్ల నష్టపోయే ప్రమా దం ఉందని ఆందోళన చెందుతున్నారు.
 
 శ్రమదానంతో తొలగిస్తున్నాం
 కె.సముద్రపుగట్టు ఛానల్ నిండా తూడు పేరుకుపోయింది. దీనిని తొలగించేం దుకు నిధులు మంజూరైనప్పటికీ సంబంధిత కాంట్రాక్టర్ పనులను చేపట్టలేదు. పాలి ఆయకట్టు రైతులంతా శ్రమదానం చేసి కాలువను బాగు చేసుకుంటున్నాం.
 - మల్లిడి రామకృష్ణారెడ్డి, రైతు, ఏఎంసీ డెరైక్టర్, పాలి
 
 ఏటా ఇంతే...
 ఛానల్‌లో పేరుకుపోయిన తూడును శ్రమదానం చేసి మేమే తొలగించుకుంటున్నాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, కాంట్రాక్టర్ తూడు తొల గింపు పనులను చేపట్టడం లేదు. ప్రతి ఏడాది ఇదే తంతు జరుగుతోంది.
 - ద్వారంపూడి సూర్రెడ్డి, రైతు, పాలి
 
 దమ్ములు చేయలేదు
 పాలి ఆయకట్టుకు కేఎస్ గట్టు ఛానల్ ద్వారా సాగునీరు సక్రమంగా సరఫరా కావటం లేదు. దీనివల్ల దాళ్వా సాగుకు ఆటంకం ఏర్పడుతోంది. నీరులేక దమ్ములు చేయలేదు. సుమారు 5 కిలోమీటర్ల మేర కాలువలో పేరుకుపోరుున తూడును తొలగించుకోవాల్సి వస్తోంది.
 - నల్లమిల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్, పాలి
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement