ఎల్.లింగోటం (చౌటుప్పల్), న్యూస్‌లైన్ :వారం రోజులుగా వేళాపాలా లేని కరెంటు కోతలను నిరసిస్తూ ఎస్.లింగో టం గ్రామరైతులు సోమవారం చౌటుప్పల్ విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వ్యవసాయానికి 7గంటల కరెంటును సక్రమంగా ఇవ్వడం లేదని, నారుమళ్లు కూడా ఎండిపోయాయని అధికారులతో వాగ్వాదానికి దిగారు. స్తంభాలు, వైరు శిథిలావస్థకు చేరి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా మంజూ రైన సబ్‌స్టేషన్ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఏడీ, డీఈ లతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తానని ఏఈ శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెన్నగోని అం జయ్యగౌడ్, సింగిల్‌విండో వైస్‌చైర్మన్ ఆనగంటి భిక్షమయ్య, ఉపసర్పంచ్ పల్సం దశరథ, ఢిల్లీ మాధవరెడ్డి, జనార్దన్‌రెడ్డి, తూర్పింటి పెంటయ్య, ఆకుల అశోక్, రాములు, బాతరాజు నాగయ్య, కృష్ణ, శ్రీను, యాదయ్య, మల్లయ్య, వెంకటేశం, రమేష్, కృష్ణారెడ్డి, నర్సింహ పాల్గొన్నారు.