విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గోవాడలో మంగళవారం ఉదయం నీటి సంఘం ఎన్నికల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం గోవాడలో మంగళవారం ఉదయం నీటి సంఘం ఎన్నికల సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీ నాయకులు ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా జాబితా ప్రకటించడంతో ఇతర పార్టీల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడి చేసి కొట్టుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికల నిర్వహణకు చర్చలు మొదలయ్యాయి.