కంభం: బస్సులో మంటలు చెలరేగడంతో కాసేపు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం బస్టాండ్‌లో బుధవారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు డిపోకు చెందిన బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తృటిలో తప్పింది.