bustand
-
'ఓ మహిళా.. జర పదిలం!' లేదంటే?
ఆదిలాబాద్: 'రాష్ట్రంలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలైనా నిర్మల్, భైంసా, ఖానాపూర్ తదితర రూట్లతో పాటు ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య అధికంగా పెరిగింది. ప్రయాణ ప్రాంగణాల్లో పురుషుల కంటే మహిళ ప్రయాణికులే ఎక్కువగా ఉండడంతో దీనిని అదునుగా తీసుకున్న చిల్లర దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు, ఆర్టీసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. మహిళలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు.' పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల వద్ద మహిళల రద్దీ.. ఆర్మూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలకు వెళ్లేందుకు మహిళా ప్రయాణికులు అధికంగా వస్తున్నారు. పల్లె వెలుగులతో పోల్చితే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. పల్లె వెలుగు బస్సులు ఎక్కువగా స్టాపులు ఉండడంతో ఎక్స్‌ప్రెస్ బస్సులకు ఎక్కడానికి మొగ్గు చూపుతున్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు మండల కేంద్రాలకు, పల్లెలకు ప్రయాణించేవారు మాత్రం పల్లె వెలుగు బస్సులు ఆశ్రయిస్తున్నారు. ఇక ప్రధాన పట్టణాలకు వెళ్లేవారు ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంల వద్ద ఎక్కువ మంది కనిపిస్తున్నారు. నిజామాబాద్, హైదరాబాద్ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వద్ద మహిళా ప్రయాణికులు ఉండడంతో చిల్లర దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఇలాంటి దొంగతనాలు గతంలో నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటువంటి రద్దీ సమయంలో ప్రయాణించే మహిళలు విలువైన నగలు ధరించకూడకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. తమ హ్యాండ్ బ్యాగులో సైతం విలువైన వస్తువులు, ఖరీదైన మొబైల్ ఫోన్లను వెంట తీసుకెళ్లకపోవడమే ఉత్తమమని అంటున్నారు. అయితే ఆర్టీసీ అధికారులు సెక్యూరిటీ సిబ్బంది కూడా నిఘా పెంచడంతోపాటు ఎప్పటికప్పుడు మైకు ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. దీనితోపాటు సీసీ కెమెరాలు నిఘా కూడా ఏర్పాటు చేశారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో చోరీ ఘటనలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పరిచయం లేని వ్యక్తులు అందించే వాటర్ బాటిల్ నీరు, తినుబండరాలు వంటివి వాటికి దూరంగా ఉండటమే మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. బస్టాండ్ ప్రాంతాల్లో బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులు కనిపిస్తే ఆర్టీసీ భద్రత సిబ్బందికి లేదా పోలీసులకు తెలియజేయాలని సూచిస్తున్నారు. గతంలో కొన్ని ఘటనలు ఇలా.. గతంలో తరచుగా హ్యాండ్ బ్యాగులు, మొబైల్ ఫోన్లు, నగలు, డబ్బులు పోయినట్లు ప్రయాణికుల నుంఛి ఫిర్యాదులు అందాయి. కొందరు చిల్లర దొంగలు బస్టాండ్ ప్రాంతాల్లో చోరీలు చేయడమే పనిగా పెట్టుకొని మాకం వేస్తారు. అందులో కొన్ని ఘటనలు ఇలా.. • గత నెలలో బస్సు ఎక్కుతున్న మహిళ చేతిలోంచి మొబైల్ ఫోన్ లాక్కొని పరిగెడుతుండగా అక్కడే ఉన్న ఆర్టీసీ భద్రత సిబ్బంది ఆ దొంగను పట్టుకొని మొబైల్ ఫోన్ సంబంధిత మహిళకు ఇచ్చి దొంగను పోలీసులకు అప్పగించారు. • పనిమీద జిల్లా కేంద్రానికి వచ్చినా ఓ వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని బంగారు నగలను గుర్తుతెలియని దొంగలు అపహరించారు. ఇలా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. భద్రతాపరమైన చర్యలు చేపడుతున్నాం! మహాలక్ష్మి పథకం ద్వారా గతంలో కంటే ప్రస్తుతం మహిళల రద్దీ పెరిగిన మాట వాస్తవమే. రద్దీకి అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. బస్టాండ్ సమీపంలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నాం. సీసీ కెమెరాలు, పోలీసుల సాకారం కూడా తీసుకుంటున్నాం. అదనపు సెక్యూరిటీని కూడా బస్టాండ్‌లో విధులు నిర్వహించేలా చూస్తున్నాం. మహిళా హోంగార్డులు, పోలీసుల సహాయం కూడా తీసుకుంటున్నాం. అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. – ప్రతిమారెడ్డి, ఆర్టీసీ డీఎం, నిర్మల్ -
నేనేం పాపం చేశానమ్మా..!? పదిరోజుల ఆడపసికందును..
సాక్షి, మిర్యాలగూడ(నల్లగొండ): నవ మాసాలు మోసి జన్మనిచ్చావు..? ఆడ పిల్లనని వదిలించుకున్నావా..? మరో కారణంతో పేగు బంధాన్ని తెంచుకున్నావా..? నా ఆకలి ఎవరు తీరుస్తారు.. ఆలనా పాలనా చూసేవారేరీ..? గుక్కపెట్టి ఏడుస్తున్న ఆ పసికందుకు మాటలు వచ్చి ఉంటే ఇలానే ప్రశ్నల వర్షం కురిపించేదేమో. తల్లిపొత్తిళ్లలో హాయిగా నిద్దరోవాల్సిన రోజుల శిశువు గుక్కపెట్టి ఏడుస్తూ గురువారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ బస్టాండ్ పరిసరాల్లో ప్రయాణికుల కంటపడింది.పోలీసులు, ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ శిశువును ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు. వివరాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ అవరణలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ రోజుల ఆడ శిశువును ప్రయాణికులు లేని ప్రాంతంలో వదిలి వెళ్లింది. ఆ చిన్నారి గుక్కబట్టి ఏడుస్తుండటంతో ప్రయాణికులు, బిట్ పోలీసులు ఆర్టీసీ డీఎం బొల్లెద్దు పాల్‌కు సమాచారం అందించారు. ఈ విషయాన్ని బస్టాండ్‌లో గల విచారణ విభాగం వారు మైక్‌లో తెలియజేసినా ఎవరూ స్పందించలేదు. దీంతో టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ సిబ్బంది శిశువును స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వైద్యులు ఐసీడీఎస్ సీడీపీఓ మమతకు సమాచారం అందించడంతో సూపర్వైజర్ మాధవి, అంగన్వాడీ టీచర్లు రజని, పద్మ ఆస్పత్రికి పంపించా రు. ఆడ శిశువును వదిలింది ఎవరు అనే విషయంపై ఆరా తీసినప్పటికి ఫలితం లేదు. స్థానిక టూ టౌన్ సీఐ సురేష్‌తో మాట్లాడి ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించగా నల్లగొండ శిశుగృహకు తరలించారు. -
మహిళలు ఇక బస్టాండ్‌లో సేఫ్.. కేరళ ఆర్టీసీ తాజా ప్రాజెక్ట్!
‘స్టే సేఫ్’... ఇది కేరళ ఆర్టిసీ తాజా ప్రాజెక్ట్. మహిళా ప్రయాణికుల కోసం రాష్ట్ర మహిళాభివృద్ధి సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను మొదలెట్టింది. సుదీర్ఘ ప్రయాణాల్లో ఉన్న మహిళలు, వేళ గాని వేళ గమ్యం చేరుకున్న మహిళలు, సొంత పనులు మీద ఒంటరిగా వచ్చిన మహిళలు... వీరు సేఫ్‌గా ఇక బస్టాండ్లలోనే గదులు తీసుకుని ఉండవచ్చు. వీరి కోసం కేరళలోని 94 డిపోల్లో ఏసి, నాన్ ఏసి గదులు తయారవుతున్నాయి. అదీ ప్రయత్నించదగ్గ ధరలకు. మహిళా ప్రయాణికులకు సంబంధించి ఇది చాలా ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశంసలు కూడా వస్తున్నాయి. గతంలో తిరువనంతపురంలో కేవలం మహిళా ప్రయాణికుల కోసం మహిళలే నడిపే గెస్ట్‌హౌస్‌ను మొదలెట్టారు. అక్కడ మహిళలకు అవసరమైన వస్తువులు, చంటి పిల్లలకు అవసరమైన వస్తువులు ఉండే స్టోర్ కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పుడు మహిళల కోసం బస్టాండ్‌లోనే గదులు కేటాయించే, నిర్మించే పనులు ప్రారంభించారు. మరో రకంగా ఇది కోవిడ్ సమయపు ఆలోచన కూడా అనొచ్చు. కోవిడ్ వల్ల ప్రయాణాలు చేసే వారి సంఖ్య కొంచెం తగ్గింది. స్త్రీలకు తోడు వచ్చే వీలు లేనివారు, లేదా కోవిడ్ వల్ల బంధువుల ఇంటికి వెళ్లడం/రానివ్వడం కుదరని వారు ఎక్కడ ఉండాలి? వారి కోసం బస్టాండుల్లోనే గదుల ఆలోచన వచ్చింది. ఇది ఆదాయం పెంచుకునే మార్గంగా కూడా కేరళ ఆర్టీసీ భావిస్తోంది. వచ్చే పోయే బస్సులతో, ప్రయాణికులతో హడావిడిగా ఉండే ప్రాంగణాలలో గదులు మహిళలకు రక్షణ ఇస్తాయన్న విషయంలో సందేహం లేదు. హోటళ్ల కంటే ఇవే క్షేమకరం అని మహిళా ప్రయాణికులు భావిస్తే రాబోయే రోజుల్లో ఈ బస్టాండ్ హోటళ్లు కిటకిటలాడొచ్చు. -
సిద్ధమవుతున్న ఏపీఎస్ ఆర్టీసీ
సాక్షి, విజయవాడ: కరోనా కాలం.. వైరస్ కట్టడికి లాక్డౌన్ అస్త్రం ప్రయోగించారు. సుమారు రెండు నెలలు కావస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ భయం నుంచి ప్రజలు తేరుకుంటున్నారు. ప్రభుత్వం లాక్డౌన్ సడలింపులు ఇచ్చింది. (ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు) దీంతో ఆర్టీసీ నిబంధనలు మేరకు సేవలందించేందుకు ముందుకొచ్చింది. తొలుత వస్తువుల రవాణాకు కార్గో సేవలు అందిస్తోంది. వలస కార్మికులకు సర్వీసులను నిర్వహిస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులకు సేవలందించే దిశగా ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా సీటింగ్‌ను సెట్ చేస్తున్నారు. కార్మికులు మరమ్మతులు నిర్వహిస్తుండగా కొందరు బస్సులను శుభ్రం చేస్తున్న దృశ్యాలను విజయవాడ బస్సు డిపోలో ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
ముద్దుపెట్టి పరారైన పోకిరీ
బనశంకరి: భారత ఐటీ రాజధానిలో పోకిరీలు రెచ్చిపోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్టాండు వద్ద క్యాబ్ కోసం వేచిచూస్తున్న యువతికి ఒక ఆగంతకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు కంగుతినింది. ఈ ఘటన బెంగళూరు జీవనబీమానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ యువతి నగరంలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో జీవనబీమానగర బస్టాండు వద్ద క్యాబ్ కోసం వేచిచూస్తోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్లి యువతి చెంపపై ముద్దుపెట్టి ఉడాయించాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్ధలంలో ఉన్న సీసీ టీవీ కెమెరా చిత్రాలను పరిశీలించి పోకిరీ కోసం వెతుకుతున్నారు. -
బెజవాడ బస్టాండ్ ఆవరణలో ఆస్పత్రి ప్రారంభం
విజయవాడ: నగరంలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏర్పాటుచేసిన ఏర్పాటు చేసిన 30పడకల ఆస్పత్రిని గురువారం ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఉద్యోగులతో పాటు కృష్ణా జిల్లాలోని ఆర్టీసీ కార్మికులకు ఈ ఆస్పత్రి ఉచిత సేవలందించనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రూ.14కోట్లతో విద్యాధరపురంలో ఏర్పాటు చేసిన 50 పడకల ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమ, ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సుమితా దావ్రా, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. -
'తిరుగు' ప్రయాణ కష్టాలు
– దసరా సెలవులు ముగియడంతో పట్టణాలకు వెళ్లిన జనం – కిటకిటలాడిన కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్ – గంటల సేపు నిరీక్షణ.. సీట్లు లేక స్టాండింగ్ ప్రయాణం కర్నూలు(రాజ్‌విహార్): దసరా సెలవులు పూర్తవడంతో పల్లెలకు వచ్చిన జనం పట్టణాల బాట పట్టారు. విద్యా సంస్థలు 13వ తేదీ నుంచి తెరుచుకోనుండడంతో పల్లెకు వెళ్లిన విద్యార్థులు సైతం బ్యాగులు సర్దుకొని తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో బుధవారం.. ఆర్టీసీ బస్టాండ్లతోపాటు రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. సాధారణ సర్వీసులోపాటు ప్రత్యేక బస్సులు, రైళ్లు కిక్కిరిసి నడిచాయి. సీట్ల కోసం ప్రయాణికులు సర్కర్ ఫీట్లు చేశారు. కర్నూలు కొత్త బస్టాండ్‌లో ఉదయం నుంచే ప్రారంభమైన రద్దీ సాయంత్రానికి తీవ్రమైంది. సీట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు. హైదరా'బ్యాడ్' ప్రయాణం: రోడ్డు రవాణ సంస్థ కర్నూలు రీజియన్ ప్రత్యేక బస్సులు నడిపినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్‌తోపాటు విజయవాడ, బెంగుళూరు, చెన్నై, నెల్లూరు తదితర ప్రాంతాలకు తీవ్ర రద్దీ నెలకొంది. 'స్పెషల్' బస్సుల్లో చార్జీలపై 50శాతం అదనంగా వసూలు చేయడంతో ప్రయాణికుల జేబులు గులయ్యాయి. కర్నూలు నుంచి అనంతపురం, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె తదితర రూట్లలో బస్సులు చాలక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఇక్కట్లపాలయ్యారు. రైల్వేస్టేషన్ కిటకిట: కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ కిటకిటలాడింది. ఇక్కడి నుంచి సికింద్రాబాదు (హైదరాబాదు)కు మధ్యాహ్నం 3గంటలకు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ రైలు ఉండడంతో ఒంటి గంట నుంచే 1వ నంబరు ప్లాట్‌ఫాం కిక్కిరిసింది. మూడు కౌంటర్లు ఏర్పాటు టికెట్లు ఇచ్చినా రద్దీ తగ్గలేదు. రైలు నిండిపోయి బయలుదేరే సమయానికి కనీసం నిల్చునే స్థలం లేక వెయ్యి మంది వెనక్కి తిరిగారు. ఈరైలు సీటింగ్ కెపాటిసీ 1800 మందికాగా ..బుధవారం నాలుగు వేల మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. అన్ని బోగీలతోపాటు లగేజీ పెట్టే కూడా ప్రయాణికులతోనే నిండిపోయింది. -
అస్తవ్యస్తంగా ట్రాఫిక్
ప్రైవేట్ వాహనాల ఇష్టారాజ్యం నిరుపయోగంగా బస్టాండ్ రాయికల్: రాయికల్ అంగడిబజార్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు పెరిగిపోతోంది. లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో సమస్య మరింత జటిలంగా తయారైంది. గతంలో శివాజీ ఏరియా నుంచి గాంధీ విగ్రహం దాకా నిర్మించిన బైపాస్ రోడ్డు ద్వారా ఆర్టీసీ అధికారులు బస్సులు నడిపారు. అనంతరం వ్యాపారుల ఆందోళనతో విరమించారు. దీంతో మళ్లీ ప్రయాణికులకు తిప్పలు మొదలయ్యాయి. రాయికల్ మండలంలో 27 గ్రామాలతోపాటు మేడిపెల్లి, కోరుట్ల, మల్లాపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు అంగడిబజార్ ముఖ్య కూడలిగా మారింది. కోరుట్ల, జగిత్యాల ఆర్టీసీ బస్సులు ఇక్కడే వచ్చి ఆగుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు ఇక్కడే నిలుపుతున్నారు. నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌ను మెరుగుపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారు. అంగడిబజార్‌లో అన్నీ సమస్యలే.. అంగడిబజార్‌లో ప్రయాణికులకు అన్నీ సమస్యలే. నిలబడేందుకు కూర్చొవడానికి షెల్టర్ లేదు. మూత్రశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం లే క తిప్పలు పడుతున్నారు. ఎండాకాలం, వానకాలంలో దుకాణాల ఎదుట నిలబడితే వ్యాపారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. లక్షలు వెచ్చించారు..నిర్లక్ష్యంగా వదిలేశారు.. మండల కేంద్రంలో లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. పందులు, పశువులకు నివాస కేంద్రంగా మారి శిథిలావస్థకు చేరుకుంది. ఊరికి దూరంగా ఉందని కొంతమంది వ్యాపారులు బస్టాండ్‌ను వినియోగంలోకి రాకుండా చేశారు. బస్టాండ్ సమీపంలోనే తహసీల్, ఎంపీడీవో, ఐకేపీ, అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం బస్టాండ్‌ను ఆధునీకరించి వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
బస్సులో చెలరేగిన మంటలు...
కంభం: బస్సులో మంటలు చెలరేగడంతో కాసేపు ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కంభం బస్టాండ్‌లో బుధవారం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్లు డిపోకు చెందిన బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన కొందరు వ్యక్తులు మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో ప్రయాణికులకు ప్రమాదం తృటిలో తప్పింది. -
మిర్యాలగూడ బస్టాండ్‌లో ఉద్రిక్తత
నల్లగొండ: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని యాజమాన్యం నూతనంగా ప్రైవేట్ డ్రైవర్ల దరఖాస్తులను కోరింది. ఈ నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చిన అభ్యర్థులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్‌లో జరిగింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. బస్టాండ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కాగా, ఆర్టీసీ యాజమాన్యం దరఖాస్తులను ఆహ్వానిస్తేనే తాము వచ్చినట్లు బస్టాండ్‌లో ఉన్న ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్లు తెలిపారు. (మిర్యాలగూడ) -
ప్రేమించాడు ... పెళ్లి చేసుకున్నాడు ... బస్టాండ్‌లో...
నిజామాబాద్ (జక్రాన్‌పల్లి) : ‘‘ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు కాపురం చేసిన తర్వాత నిజామాబాద్ తీసుకెళ్లి బస్టాండ్‌లో వదిలేసి వచ్చాడు. దీంతో చావాలనుకున్నా. పోలీసులు కాపాడారు’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది కలిగోట్‌కు చెందిన శిరీష. సోమవారం భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కలిగోట్ గ్రామానికి చెందిన నాయిక అశ్వంత్ , మెతుకు శిరీష చిన్నప్పటినుంచి క్లాస్‌మెట్స్. పదో తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో, ఇంటర్ నిజామాబాద్‌లోని కాకతీయ కళాశాలలో కలిసి చదివారు. జిల్లా కేంద్రంలో వేరువేరు కళాశాలల్లో డిగ్రీ కోర్సుల్లో చేరారు. వీరి మధ్య పదో తరగతిలోనే ప్రేమ అంకురించింది. ఏడాదిన్నరక్రితం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని ఇంట్లోనుంచి పారిపోయారు. అయితే అశ్వంత్‌కు 20 ఏళ్లే ఉండడంతో అప్పట్లో ఆలయ పూజారులు పెళ్లి చేయడానికి నిరాకరించారు. దీంతో వెనుదిరిగి వచ్చారు. 2013 మేలో శిరీషకు కుటుంబ సభ్యులు బంధువుతో పెళ్లి చేశారు. ఆమె భర్తకు అశ్వంత్ తరచూ ఫోన్ చేసి తమ ప్రేమ వ్యవహారం చెప్పేవాడు. ఆమె లేకుండా బతకలేనని పేర్కొనేవాడు. దీంతో పెళ్లైన నెలలోపే శిరీషకు విడాకులయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో అశ్వంత్ శిరీషను ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి తీసుకొని వెళ్లి స్నేహితుల సమక్షం లో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం కలిగోట్ వెళ్లారు. కొంతకాలం కలిసి బాగానే ఉన్నామని, అయితే కట్నం తీసుకుని రమ్మంటూ అత్తమామలు వేధించేవారని శిరీష తెలిపింది. వారం క్రితం బైక్‌పై నిజామాబా ద్ తీసుకొని వచ్చాడని, తనను బస్టాండ్‌లో ఉండమని చెప్పి వెళ్లిపోయాడని పేర్కొంది. ఎంతకీ రాకపోయేసరికి ఫోన్ చేస్తే స్విచ్ఆఫ్ అని వచ్చిందని తెలిపింది. దీంతో మోసం చేశాడని గ్రహించానని, చావాలనుకొని బాసరకు వెళ్లానని పేర్కొంది. అక్కడ నది ఒడ్డున ఆలోచిస్తూ నిల్చొని ఉండగా పోలీసులు వచ్చారని, విషయం తెలుసుకొని స్టేషన్‌కు తీసుకెళ్లి జక్రాన్‌పల్లి పోలీసులకు సమాచారం అందించారని తెలిపింది. భర్త మంచివాడేనని, అత్తమామలు మనసు మార్చి ఉంటారని పేర్కొంది. అత్తమామలు నాయిక గంగామణి, రాజన్నలపై పోలీసులకు ఫిర్యాదు చేశానంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ భర్త ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నానని తెలిపింది. విషయం తెలుసుకున్న లోక్‌సత్తా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఏకే లత బాధితురాలికి మద్దతు పలికారు. -
బస్టాండ్‌లో ఎలుగుబంటి హల్చల్
-
ఆగని కామాంధుల ఆకృత్యాలు
కోదాడ అర్బన్, న్యూస్‌లైన్ నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చిన కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది.. కొందరి మృగాళ్ల చేతిలో చిన్నారులు నలిగిపోతూనే ఉన్నారు. ఓ లారీ క్లీనర్ మాయమాటలు చెప్పి ఓ చిన్నారిని లొంగతీసుకుని నాలుగు రోజుల పాటు అత్యాచారం జరిపిన ఘటన కోదాడలో ఆలస్యంగా వెలుగుచూసింది. సీఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మైనర్ తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఈ నెల 6న ఇంటి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్లింది. తిరిగి వచ్చే క్రమంలో ఈ నెల 12న కోదాడ బస్టాండ్‌కు చేరుకుంది. బస్టాండ్‌లో ఆమెకు మాతానగర్‌కు చెందిన జానీ అనే లారీక్లీనర్ పరిచమయ్యాడు. అతడు ఆమెకు మాయమాటలు చెప్పి ఓ బహిరంగ ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం జరిపాడు. అనంతరం ఆమెను తన మిత్రుడు రాకేష్ గదిలో ఉంచి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బంధువుల ఇంటి నుంచి బయలుదేరిన తన కుమార్తె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి ఆది వారం రాత్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో ఆ బాలిక ఫోన్ ద్వారా తన సోదరికి ఆచూకీ తెలిపింది. ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు కోదాడలో గాలిస్తుం డగా జానీ,అతని మిత్రుడు పరారయ్యారు. పోలీసులు ఆ బాలికను కోదాడలో సోమవారం కనుగొన్నారు. ఈ సంఘటనపై బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు జానీ, అతడికి ఆశ్రయమిచ్చిన రాకేష్‌లపై నిర్భయచట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.