సాక్షి, విజయవాడ: కరోనా కాలం.. వైరస్ కట్టడికి లాక్‌డౌన్ అస్త్రం ప్రయోగించారు. సుమారు రెండు నెలలు కావస్తోంది. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రజారవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేశారు. ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడిప్పుడే వైరస్ భయం నుంచి ప్రజలు తేరుకుంటున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చింది. (ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు)
దీంతో ఆర్టీసీ నిబంధనలు మేరకు సేవలందించేందుకు ముందుకొచ్చింది. తొలుత వస్తువుల రవాణాకు కార్గో సేవలు అందిస్తోంది. వలస కార్మికులకు సర్వీసులను నిర్వహిస్తోంది. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులకు సేవలందించే దిశగా ఆలోచన చేస్తోంది. అందుకు అనుగుణంగా సీటింగ్‌ను సెట్ చేస్తున్నారు. కార్మికులు మరమ్మతులు నిర్వహిస్తుండగా కొందరు బస్సులను శుభ్రం చేస్తున్న దృశ్యాలను విజయవాడ బస్సు డిపోలో ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment