సాక్షి, విజయవాడ: ఈ నెల 16న హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బస్సులు నడవనున్నాయి. అయితే నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయినవారిని స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయాణానికి వెసులుబాటు ఉంటుంది. అంతేకాకుండా స్వస్థలాలకు చేరుకున్న తర్వాత సంబంధిత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేపట్టారు. 16వ తేదీ నుంచి ఏపీకి బస్సులు నడపనున్నారు.
కాగా కరోనా వైరస్‌తో హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ ప్రక్రియను ఏపీఎస్ ఆర్టీసీ నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపు ఇవ్వడంతో ప్రజా రవాణా శాఖాధికారులు బస్సులు తిప్పేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ(పీటీడీ) ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్ జారీ చేసిన విషయం తెలిసిందే. (ఏపీలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు)
Comments
Please login to add a commentAdd a comment