రూ.30 లక్షల ఆస్తి నష్టం
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఆటో నగర్‌లో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. వన్‌టౌన్ సీఐ విజయకుమార్ కథనం మేరకు పలమనేరుకు చెందిన ఓ బస్సుకు టింకరింగ్ పనులు చేయడానికి చిత్తూరుకు తీసుకొచ్చారు. ఇక్కడున్న ఎస్టేట్‌లో సాయంత్రం గ్యాస్ కట్టర్‌తో పనులు చేస్తుండగా బస్సు కింది భాగానికి నిప్పంటుకుంది. దీన్ని చూసుకోకపోవడంతో ఒక్కసారిగా అగ్ని జ్వాలలు ఎగసిపడ్డాయి. సమీపంలో ఉన్న శీన అనే వ్యక్తికి చెందిన బ్యాటరీ దుకాణానికి అంటుకోవడంతో బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు కాలి బూడిదయ్యాయి. అలాగే ఓ స్కూటర్ సైతం కాలిపోయింది. టింకరింగ్ చేస్తున్న వ్యక్తి కుట్టికి సంబంధించిన దుకాణం కూడా బూడిదయ్యింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేకుంటే బస్సులోని డీజల్ ట్యాంకుకు నిప్పంటుకుని పెద్ద ప్రమాదమే జరిగేది. వన్‌టౌన్ సీఐ విజయకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
చిత్తూరు ఎస్టేట్‌లో అగ్ని ప్రమాదం
Published Thu, Feb 4 2016 2:21 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement