నరసన్నపేట:హుదూద్ తుపాను ప్రభావం దీపావళి పండుగపై సైతం పడింది. ఏడాదికి ఒకసారి ఉత్సాహంగా అందరూ జరుపుకొనే పండుగ సందడిపై తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది. తుపాను బాధితులు ఇబ్బందుల్లో ఉండడంతోపాటు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మూడు జిల్లాల్లో దీపావళి సామగ్రి విక్రయాలను ఈ ఏడాది నిషేధించారు. దీంతో విక్రయూనికి కొద్దిరోజులు ముందుగానే తెప్పించిపెట్టుకున్న బాణసంచాను వ్యాపారులు గుడౌన్లకే పరిమితం చేయడంతో తీవ్రంగా నష్టపోయూరు. నిషేధం ఉండడంతో బాణసంచా ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో పిల్లలను బుజ్జగించలేక తల్లిదండ్రులు అవస్థలు పడ్డారు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 6 కోట్లు నుంచి పది కోట్ల రూపాయల వరకు బాణ సంచాను వ్యాపారులు తెప్పించి కనీసం 20 కోట్ల రూపాయలకు విక్రయించేవారు. దీనికి కోసం ముందగానే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టేవారు.
దుకాణాలు తెరిచేందుకు పంచాయతీ , అగ్నిమాపక , రెవెన్యూ , పోలీసు తదితర శాఖల అనుమతులు అవసరం. ఈ అనుమతులు పొందడానికి అనధికారికంగా లెసైన్స్‌ఫీజులు రూపేనా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపారులు అనుమతులు తెచ్చుకునేవారు. ఈ సంవత్సరం దీపావళి రెండు రోజుల ముందు ముఖ్యమంత్రి ఈ మూడు జిల్లాల్లో బాణసంచా విక్రయాలు అనుమతించవద్దని ఆదేశించడంతో అధికారులు, వ్యాపారులు ఇరకాటంలో పడ్డారు. జిల్లాకు తాడేపల్లిగూడెం, శివకాశీ వంటి సుదూర ప్రాంతాల నుంచి హోల్‌సేల్ ధరలకు వ్యాపారులు బాణసంచా తెచ్చి విక్రయిస్తుంటారు. వీటిని విక్రయించేందుకు కేవలం దీపావళి ముందు రోజు కానీ, అంతకంటే ముందు రోజు కానీ అనుమతిస్తుంటారు. అయితే దీపావళి అనంతరం ఈ లెసైన్స్‌లు విక్రయాలకు ఉపయోగపడవు. తెచ్చిన లక్షలాది రూపాయల విలువచేసే బాణ సంచాను వచ్చే ఏడాది వరకు భద్ర పరిచేందుకు అనుమతి ఉండదు. అంతేకాకుండా భద్రపరచడం కూడా వ్యాపారికి తలకుమించిన భారమే. ఈ కారణంగా వ్యాపారులంతా తాము తెచ్చిన సరుకును తిరిగి అదే హోల్‌సేల్‌వ్యాపారికి రిటన్ చేశారు.
బాణసంచా వ్యాపారులకు హుదూద్ దెబ్బ
Published Sat, Oct 25 2014 1:49 AM | Last Updated on Tue, Oct 2 2018 5:04 PM
Advertisement
Advertisement