బాణసంచా తాత్కాలిక లైసెన్స్‌లు షురూ..
ఒంగోలు : దీపావళి పండగ కోసం బాణసంచా విక్రయించేందుకు ఆసక్తి కలిగినవారు అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ నరసింగరావు తెలిపారు. బాణ సంచా విక్రయించేందుకు తాత్కాలిక దుకాణాల ఏర్పాటుపై మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, అగ్నిమాపకశాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఒంగోలు నగరంలో పీవీఆర్ బాయిస్ హైస్కూల్ గ్రౌండ్, డీఆర్‌ఆర్‌ఎం మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో దుకాణాలు పెట్టుకొనేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
చీరాల, కందుకూరు, మార్కాపురం పట్టణాల్లో ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అక్కడి మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, పోలీసు ఇన్‌స్పెక్టర్లు బాణ సంచా విక్రయ ప్రదేశాలను నిర్ణయిస్తారన్నారు. ఒంగోలుతో పాటు ఇతర పట్టణాలల్లో నిర్ణయించినట్లు కాకుండా, ఇతర స్థలాల్లో విక్రయించుకునేందుకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదన్నారు. సంబంధిత లైసెన్స్‌లు జిల్లా కలెక్టర్ జారీ చేస్తారన్నారు. అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని, చివరిరోజైన 30వ తేదీ సాయంత్రం 7గంటలకు స్టాల్స్ ఖాళీ చేయాలని తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు, మునిసిపల్, అగ్నిమాపకశాఖల అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
తొమ్మిది రకాల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి