సముద్రంలో వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు అసువులు బాశాడు.
పిఠాపురం (తూర్పుగోదావరి) : సముద్రంలో వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు అసువులు బాశాడు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం అమీనాబాద్‌కు చెందిన సత్తిబాబు(32) గురువారం ఉదయం సముద్రంలో వేటకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.