
రచ్చ ఆదినారాయణ
కేశనపల్లిలోని ఫిషర్‌మెన్ సొసైటీకి లీజుకు ఇచ్చిన భూములను కాపాడమంటూ పాదయాత్రలో వైఎస్ జగన్‌ను సొసైటీ అధ్యక్షులు రచ్చ ఆదినారాయణ కోరారు. తాను శ్రీనివాసా ఫిషర్‌మెన్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడినని, 1975లో దేవస్థానానికి చెందిన 106 ఎకరాల భూమిలో 18 ఎకరాలను ఫిషర్‌మెన్ సొసైటీకి ఇచ్చారన్నారు. ఆ భూములను దీర్ఘకాలంగా ఫిషర్‌మెన్ సొసైటీ సభ్యులు సాగు చేసుకుంటున్నారన్నారు. భూములను కొందరు తక్కువ ధరకు లీజుకు తీసుకుని వాటిని స్వాధీన పర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.