గంగమ్మా.. కాపాడమ్మా.. | Fishermen's Day celebrations | Sakshi
Sakshi News home page

గంగమ్మా.. కాపాడమ్మా..

Published Sat, Nov 22 2014 7:00 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

Fishermen's Day celebrations

  • మత్స్యకారుల మహిళలు పూజలు
  •  ఘనంగా మత్స్యకారుల దినోత్సవం
  • డాబాగార్డెన్స్ : మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్యకార మహిళలు పసుపు నీళ్లతో గంగమ్మతల్లికి పూజలు నిర్వహించారు. ఫిషింగ్ హార్బర్ గాంధీ విగ్రహం నుంచి జెట్టీ సమీపంలో ఉన్న గంగమ్మతల్లి ఆలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులను కాపాడాలని వేడుకున్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం రోజున పబ్లిక్ హాలీడేగా ప్రకటించాలని విశాఖ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గరికిన దానయ్య ఈ సందర్భంగా కోరారు. వేటకు వెళ్లేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలపై యువభారత్ ఫోర్స్ అధ్యక్షుడు సాధిక్ రెల్లివీధి గాంధీ విగ్రహం వద్ద మత్స్యకారులకు అవగాహన కల్పించారు.
     
    ఎస్టీ జాబితాలో చేర్చాలి : మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఫిషరీ ఇండస్ట్రీస్(ఏఐఎఫ్‌ఐ) అధ్యక్షుడు డాక్టర్ వై.జి.కె.మూర్తి డిమాండ్ చేశారు. మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఫిషింగ్ హార్బర్‌లో గల ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఫారిన్ ఫిషింగ్‌కు అనుమతి ఇవ్వరాద ని, మత్స్యకారుల అభివృద్ధికి మత్స్యశాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు.

    కార్యక్రమం లో మత్స్యశాఖ సంయుక్త సంచాలకుడు కోటేశ్వరరావు, సహాయ సంచాలకుడు లక్ష్మణరా వు, ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, డాల్ఫిన్ బోటు ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణమూర్తి, ఎం.రాముడు, జి.కుంజుమన్, జి.గరగయ్య, సి.హెచ్.ఎల్లాజీ, పోలరాజు, ఎల్లారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement