ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు చలిగాలులు తట్టుకోలేక జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
బలిజేపల్లి (వేమూరు), న్యూస్‌లైన్: అల్పపీడనం కారణంగా ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు, చలిగాలులకు వేర్వేరు గ్రామాల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మండలంలోని బలిజేపల్లికి చెందిన కారుమంచి లక్ష్మణరావు (58), వేమూరుకు చెందిన పందిట ఏసు (55) చలిగాలులు తట్టుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లక్ష్మణరావుకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పందిట ఏసు మృతిపై వీఆర్వో వెంకటేశ్వరరావు వివరాలు సేకరించి తహశీల్దార్ లక్ష్మీప్రమీలకు నివేదించారు.
గుంటూరు శివనాగరాజుకాలనీలో..
ఏటీ అగ్రహారం (గుంటూరు): గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శుక్రవారం నగరంలోని శివనాగరాజు కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక శివనాగరాజు కాలనీ ఐదోలైన్‌కి చెందిన చల్లగుల్ల మాణిక్యం(85) కాలనీలోని నివాసాల్లోకి వర్షపునీరు చేరడంతో మూడు రోజులుగా రేకుల గదిలో ఉంటోంది. దీంతో ఈదురు గాలులు, వర్షం కారణంగా వృద్ధురాలు మృతి చెందినట్లు తెలిపారు.
బడేపురంలో..
తాడికొండ: తాడికొండ శివారు గ్రామం బడేపురంలో గురువారం అర్ధరాత్రి నాగం సుబ్బమ్మ (75) మృతి చెందింది. కొంతకాలంగా పూరింటిలో ఒంటరిగా ఉంటూ కూలి పనులకు వెళుతోంది. తుపాను గాలులకు తోడు, చలిగాలులు కూడా వీయడంతో వృద్ధురాలు చెందింది. సుబ్బమ్మకు ఒక కుమారుడు ఉన్నాడు.
మునుగోడులో..
అమరావతి: మునుగోడు గ్రామంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు, ఈదురుగాలులకు తట్టుకోలేక వృద్ధురాలు మృతిచెందింది. గురువారం రాత్రి మునుగోడుకు చెందిన షేక్ బేగంబీ(70) మృతిచెందింది. ఆరోగ్యంగానే ఉన్న ఆమె వర్షాలకుతోడు చలికి తట్టుకోలేక మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. బేగంబీ భౌతికకాయాన్ని శుక్రవారం గ్రామపెద్దలు, స్థానికులు సందర్శించి నివాళులు అర్పించారు.
చలిగాలులకు ఐదుగురి మృతి
Published Sat, Oct 26 2013 3:44 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement