బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి
మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట సమీపంలో బుధవారం ఉదయం 5.30 గంటలకు జరిగిన ఘోర ప్రైవేట్ వోల్వో బస్సు ప్రమాదంలో ఐదుగురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
బెంగళూరు నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తున్న ఈ బస్సు నేషనల్ హైవే-44 పై ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐబీఎమ్, ఇతర సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న ఐదుగురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో కేప్ జెమినీలో పనిచేస్తున్న అమరేందర్ (కరీంనగర్) ఉన్నట్టు తెలిసింది. మిగితా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇప్పటి వరకు 45 మంది మృతదేహాలను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వెలికితీశారు. మరణించిన వారిలో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వివరాలను జబ్బర్ ట్రావెల్స్ సేకరించారు.