పుంగనూరు (చిత్తూరు జిల్లా) : వివాహితను వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. గురువారం పుంగనూరు అసిస్టెంట్ సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్. రాధమ్మ కేసు పూర్వాపరాలను పరిశీలించి ఈ తీర్పును వెలువరించారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. పుంగనూరుకు చెందిన తేజస్విని(19) అనే వివాహితను 2014లో జగదీష్‌బాబు అనే వ్యక్తి వేధింపులకు గురిచేసేవాడు. దీంతో మనస్తాపం చెందిన ఆమె గత ఏడాది ఆగస్టు నెలలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని జగదీష్‌బాబును అరెస్ట్ చేశారు.
అయితే విచారణలు ముగిసిన అనంతరం పుంగనూరు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జగదీష్‌ను దోషిగా గుర్తించి ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాకుండా రూ. 5వేలు జరిమానా విధించింది. ఈ జరిమానా చెల్లించని యెడల మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. కాగా తేజస్విని భర్త ప్రశాంత్(25) భార్య మరణంతో మనస్తాపం చెంది నెలరోజుల్లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం విశేషం.
వివాహితను వేధించిన కేసులో వ్యక్తికి ఐదేళ్ల జైలు
Published Thu, Aug 27 2015 5:58 PM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
Advertisement