మత్తుమందు చల్లి దోపిడి.. | Flavored drug and theft in prakasam district | Sakshi
Sakshi News home page

మత్తుమందు చల్లి దోపిడి..

Published Wed, Dec 9 2015 9:21 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

Flavored drug and theft in prakasam district

దర్శి: ప్రకాశం జిల్లాలో మహిళపై మత్తుమందు చల్లి భారీగా సొత్తును దోపిడిదొంగలు దోచుకెళ్లారు. ఈ సంఘటన దర్శి మండలం కేంద్రంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

స్థానిక అద్దంకి రోడ్డులో నివసిస్తున్న శీలం పద్మ అనే మహిళ మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుంది. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై మత్తు మందు చల్లి 8 తులాల బంగారం, అరకిలో వెండి సామాన్లతో పాటు రూ. 3 వేల నగదును దోచుకెళ్లారు. దీనిపై ఆమె స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement