పట్టణాల అభివృద్ధిపై దృష్టి
మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ
మచిలీపట్నం (కోనేరుసెంటర్) : రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ అన్నారు. శనివారం స్థానిక మల్కాపట్నంలోని ట్రావెల్స్‌బంగ్లా ఆవరణలో రూ. 5 కోట్లతో నిర్మించనున్న పురపాలక సంఘ కార్యాలయ భవనానికి శనివారం మంత్రులు సిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో 75 శాతం మంది పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నారన్నారు.తద్వారా ఆయా దేశాల తలసరి ఆదాయం అధికంగా ఉంటోందని చె ప్పారు. మన రాష్ర్టంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో స్వల్ప సంఖ్యలో నివసిస్తుండడంవల్లే తలసరి ఆదాయం తక్కువగా ఉంటోందన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తలసరి ఆదాయం తెలంగాణలో రూ.లక్షా 35 వేలు, మన రాష్ట్రంలో రూ.లక్షా 7వేలు ఉందని మంత్రి చెప్పా రు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టారని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేయించి ప్రజల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ప్రతిజిల్లా కేంద్రంలో విద్యుత్ యూనిట్లు
పదమూడు జిల్లాల్లోని ప్రధాన కేంద్రా ల్లో వ్యర్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు యూనిట్స్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు నారాయణ వివరించారు. తొలుత శ్రీకాకుళంలో పెలైట్ ప్రాజెక్టు కింద ఒక యూనిట్‌ను ఏర్పాటుచేస్తున్నామన్నారు. మచిలీపట్నంకు 9500 ఎల్‌ఈడీ బల్బులు అమర్చుతున్నట్లు తెలిపారు. అమృత్ పథకం కింద బందరు ప్రాంతంలో రూ.37.50 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.
రోడ్ల అభివృద్ధితోనే పరిశ్రమలు
రాష్ట్ర రవాణా, ఆర్ అండ్ బీశాఖ మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ రహదారులు అభివృద్ధి చెందితేనే పరిశ్రమ లు, వ్యాపార సంస్థలు వృద్ధి చెందుతాయన్నారు. పదేళ్లుగా రహదారులను నిర్లక్ష్యం చేశారన్నారు. బందరు ప్రాంతరోడ్ల అభివృద్ధికి సాయంచేస్తామని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులు మాట్లాడుతూ దేశంలో రెండోదిగా చరిత్రకెక్కిన బం దరు మునిసిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఎల్.ఎన్.ప్రసాద్, ఏఎంసీ ైచైర్మన్ గోపు సత్యనారాయణ, వైస్‌చైర్మ న్ కాశీవిశ్వనాథం, కమిషనర్ జస్వంతరావు, ఆర్డీవో పీ సాయిబాబు, బూరగడ్డ రమేష్‌నాయుడు పాల్గొన్నారు.