ఓయూ స్థలంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం పలు విద్యార్థి సంఘాలు విశ్వవిద్యాలయుంలో నిరసనకు దిగాయి . తెలంగాణ విద్యార్థి వేదిక నేతలు స్వాగత్ గ్రాండ్ హోటల్ పై దాడి చేసి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట ఏబీవీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు వినూత్న రీతిలో నిరసన చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్) నేతలు ఆర్ట్స్ కళాశాల ఎదుట సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను, టీఆర్‌ఎస్ పార్టీ జెండాను దహనం చేశారు.
ఓయూను కాపాడుకుందాం
ఉస్మానియా యూనివర్సిటీ: ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని వైఎస్సార్ సీపీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఓయూ పూర్వ విద్యార్థి బీష్వ రవీందర్ అన్నారు. సోమవారం ఓయూ క్యాంపస్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓయూ భూముల రక్షణ, ఉద్యోగాల ప్రకటన కోసం విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. వందేళ్ల చరిత్ర గత ఉస్మానియా విశ్వవిద్యాలయం లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించిందని, ఈ భూములపై సీఎం కేసీఆర్ దృష్టి పడటం దారుణమన్నారు. ఎందరో ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులను అందించిన విద్యా వనం భూములలో ఇళ్లు నిర్మించాలనుకోవడం దారుణమన్నారు.
ఓయూలో రగడ
Published Tue, May 26 2015 2:35 AM | Last Updated on Sat, Aug 11 2018 7:54 PM
Advertisement