సాక్షి, గుంటూరు: ఓ గండం గట్టెక్కింది. అధికారుల శ్రమ ఫలించింది, ఏమవుతుందా అని భయం తీరింది. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి హోం క్వారంటైన్ శనివారంతో ముగిసింది. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా 28 రోజుల పాటు స్వీయ నిర్భంధం ముగిసింది. ఇంటిల్లిపాదికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేకపోవటంతో కరోనా మహమ్మారి నుంచి బయట పడ్డామంటూ సంబరపడిపోయారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వీరి పట్ల వైద్యాధికారుల, ఏఎన్‌ఏంలు, వలంటీర్లు, పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2,087 మందిని గుర్తించి హోం ఐసోలేషన్‌లో పెట్టారు. వారి భార్య, బిడ్డలు, తల్లిదండ్రులను కూడా కలవకుండా 28 రోజుల గహనిర్బంధంలో ఉంచారు. 24 గంటలు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఇళ్ల ముందు పోలీస్ పహారా పెట్టి ప్రత్యేకంగా పర్యవేక్షించారు.
కరోనా లక్షణాలు లేవు
జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు 2,087 మంది ఉన్నారు. వీరందరి హోం క్వారంటైన్ ముగిసింది. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రస్తుతం కరోనా లక్షణాలు లేవు. –డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, గుంటూరు.
Comments
Please login to add a commentAdd a comment