కెనడా టూ మేడారం
ఖండాంతరాలు దాటొచ్చి కెనడా యువతి ఎమెలీ మేడారంలోని సమ్మక్క, సారలమ్మను సోమవారం రాత్రి 8 గంటల సమయంలో దర్శించుకుంది. తనకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా జాతర గురించి తెలిసిందని.. పేర్కొంది. పగలు వస్తే ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉంటారనే ఉద్దేశంతో రాత్రివేళలో దర్శనానికి వచ్చానని.. కానీ ఇప్పుడు కూడా వందల సంఖ్యలో భక్తులు ఉండటం ఆశ్చర్యంగా ఉందని తెలిపింది. 15 రోజులకు ముందే ఇలా ఉంటే జాతరవేళ ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయింది. - సాక్షి, మేడారం