సాక్షి, ఏలూరు : ఆకలిని తట్టుకోలేక.. అప్పులు తీర్చలేక.. అయిన వాళ్లు లేక.. ఆలుమగలకు పొసగక.. జీవితంలో ఓడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్లను చూశాం. రక్త సంబంధీకులు దూరమైతే తట్టుకోలేక గుండెఆగి మరణిస్తున్న ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నారుు. కానీ.. తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేసే ప్రయత్నాలను తట్టుకోలేక ఎన్నో గుండెలు ఆగిపోతున్నారుు. సమైక్యతను నరనరానా నింపుకున్న వారు తెలుగు జాతి విచ్ఛిన్నమవుతుందనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. జూలై 31న రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాటినుంచి జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం మొదలైంది. గురువారం నాటికి 30 రోజులు పూర్తరుు్యంది. అయినా స్వార్థ రాజకీయ నాయకులు పదవులు వదిలి ప్రజా ఉద్యమంలోకి రాలేకపోయారు. కనీసం ఇంటికి కూడా రావడం మానేశారు. మరోవైపు రాష్ర్ట విభజన ప్రకటనను వెనుక్కు తీసుకునే ప్రసక్తే లేదని ఢిల్లీ పెద్దలు తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్ర సమైక్యతను కాపాడుకోలేమోననే ఆవేదనతో జిల్లాలో నలుగురు ఆత్మ బలిదానం చేసుకున్నారు. గురువారం రాత్రి వరకు 79 మంది గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
రాష్ట్రాన్ని రెండుగా చీల్చుతున్నట్టు ప్రకటన వెలువడిన మూడో రోజునే జిల్లాలో తొలి ఆత్మబలిదానం చేసుకున్నది ఓ సాధారణ తాపీమేస్త్రి. 35 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇర్రింకి శ్రీనివాసరావు (శ్రీను) రెండు రోజులపాటు సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో పాల్గొన్నాడు. పాలకోడేరు మండలం విస్సాకోడేరుకు చెందిన అతడు ఈ నెల 2న నిరసన కార్యక్రమాల నుంచి నేరుగా ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని త్యాగం లక్షలాది మందిని కదిలించింది. ఉద్యమం ఆవశ్యకతను చాటింది. నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన గుల్లా రవికుమార్ రెక్కాడితేగాని డొక్కాడని రోజు కూలీ. ఇతని వయసు కూడా 35 ఏళ్లే. విభజన ఖాయమని వస్తున్న వార్తలతో మనస్తాపం చెందాడు. ఈ నెల 5న పురుగు మందు తాగేశాడు. తల్లి, భార్యను అనాథలుగా మిగిల్చి వెళ్లిపోయూడు. ఉండి మండలం కోలమూరుకు చెందిన మువ్వా మేషక్ కూడా కూలి పనులు చేసుకునేవాడే.
అవివాహితుడైన 22 ఏళ్ల మేషక్ మతిస్థిమితం లేని చెల్లెలు, వృద్ధులైన తల్లిదండ్రులను కూలి డబ్బులతోనే పోషిస్తున్నాడు. ఈ నెల 6న పొలం గట్టువద్ద పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఇరగవరం మండలం కాకిలేరుకు చెందిన పెయింటర్ దిగుమర్తి రాజీవ్‌గాంధీ అవివాహితుడు. అతని వయసు 22 ఏళ్లు. ఈనెల 7న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులకు కన్నీరు మిగిల్చాడు. ఏంతో భవిష్యత్ ఉన్న యువకులు చీకటవుతున్న భవిష్యత్‌ను తలుచుకుని తెలుగుతల్లి ఒడి నుంచి మృత్యు ఒడికి చేరారు. కొందరు ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. మరోవైపు నిత్యం మనోవేదనకు గురవుతున్నవారి గుండెలు అలసి ఆగిపోతున్నాయి
ప్రాణాలు పోతున్నాయ్
Published Fri, Aug 30 2013 12:59 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
Advertisement
Advertisement