కారును ఢీ కొన్న లారీ: నలుగురు మృతి | Four people killed in lorry, car accident at Kandhada, rangareddy district | Sakshi
Sakshi News home page

కారును ఢీ కొన్న లారీ: నలుగురు మృతి

Published Wed, Oct 16 2013 8:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM

Four people killed in lorry, car accident at Kandhada, rangareddy district

రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం కందాడ సమీపంలోని హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడుతో వస్తున్న లారీ కందాడ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. దాంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు.

 

ఆ దుర్ఘటనలో మరణించిన వారు ఇందోల్ గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, పవిత్ర, శకుంతల, సాయినాథ్ రెడ్డిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహలను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు చెప్పారు. అయితే ఆ ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యడని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement