శిక్షణ పొందుతున్న మొదటి బ్యాచ్ విద్యార్థులు
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు
ఏపీపిఎస్‌సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్‌ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు.
అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్‌ను సంప్రదించగలరు.
Comments
Please login to add a commentAdd a comment