groups exams
-
తెలంగాణ తెచ్చుకుందే జాబ్స్ కోసం.. గ్రూప్స్ అభ్యర్థులతో భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిసెంబర్లో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తున్నట్టు భట్టి చెప్పుకొచ్చారు. నిరుద్యోగులు చెప్పిన ప్రతీ విషయాన్ని సీరియస్‌గా ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సచివాలయంలో నేడు గ్రూప్-2 అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోరిక మేరకు గ్రూప్-2 పరీక్షను డిసెంబర్‌కు వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌ను ఆదేశించాం. మూడు నెలల కాలంలోనే 54వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం.గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి. సీఎల్పీ నేతగా నేను, పీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది. మేము అలా ఆలోచించడం లేదు మా బిడ్డలు స్థిరపడాలి. వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి కేసుల పాలైతే మీరే నష్టపోతారు. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడవద్దు. కొద్ది రోజుల్లోనే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం. అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం. పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారు. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు.. అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇక నుంచి అశోక్ నగర్లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు. నిరుద్యోగులు చెప్పిన ప్రతీ అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తాం. మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిరుపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన. ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది, పరిష్కరిస్తుంది. గ్రూప్-2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వారి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం’ అని అన్నారు. -
కష్టపడితే నెలలో ‘గ్రూప్స్’ కొట్టొచ్చు
సాక్షి, హైదరాబాద్: పరీక్షల కోసం కాకుండా, పరిశోధనాత్మకంగా అభ్యాసన చేస్తే గ్రూప్స్‌లోనే కాదు సివిల్స్‌లోనూ రాణిస్తారని ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ అభిప్రాయపడ్డారు. కోచింగ్ సెంటర్స్‌కు వెళ్తేనే పోటీ పరీక్షలో విజయం సాధిస్తామనేది భ్రమని చెప్పారు. గ్రూప్స్‌లో ఇంటర్వ్యూ తొలగించినందున పరిజ్ఞానం ఉన్నవాడికి పారదర్శకంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. గ్రూప్స్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థులు ఏ విధంగా సన్నద్ధమవ్వాలనే అంశంపై రవీందర్ ‘సాక్షి’తో పంచుకున్న అంశాలు ఆయన మాటల్లోనే... లక్ష్య సాధన దిశగా విద్యార్థుల పాత్రేంటి? ఉస్మానియా యూనివర్సిటీ ఈ మధ్య దీనిపై లోతుగా అధ్యయనం చేసింది. చాలామంది విద్యార్థుల్లో అంతర్లీనంగా సామర్థ్యాలున్నాయి. దృష్టి పెడితే పోటీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా ఉంది. కానీ వాళ్లు స్వల్పకాలిక లక్ష్యాలకే ప్రాధాన్య మిస్తున్నారు. ఏదో ఒక ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నారు. దీంతో గ్రూప్స్ పోటీకి దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోలేకపోతున్నారు. దీన్ని గమనిం చిన తర్వాత ఓయూలో సివిల్స్ అకాడమీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీని కోసం రూ.37 లక్షలు ఖర్చు పెట్టాం. కోచింగ్ కేంద్రాలతో ఫలితం ఎలా ఉంటుంది? లక్షల మంది విద్యార్థులు కోచింగ్ కేంద్రాల బాట పడుతున్నారు. అక్కడికి వెళ్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తామని భ్రమ పడుతున్నారు. నా అనుభవం ప్రకారం ఇది శుద్ధ దండగ. అక్కడ కేవలం షార్ట్ కట్ పద్ధతులు మాత్రమే చెబుతారు. ఒకరకంగా ఇది మల్టిపుల్ చాయిస్ లాంటిదే. ఆ మాదిరి ప్రశ్న వస్తేనే అభ్యర్థి సమాధానం ఇవ్వగలడు. కానీ సొంతంగా సబ్జెక్టుపై అవగాహన పెంచుకుంటే మెరుగైన రీతిలో గ్రూప్స్‌లో రాణించే వీలుంది. కాబట్టి కోచింగ్ కేంద్రాలకు వెళ్లి విద్యార్థులు తమ విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దు. ఏం చదవాలి? గ్రూప్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవాలి. ముఖ్యంగా 8 నుంచి ఇంటర్ వరకూ ఉన్న పుస్తకాలను అభ్యసించాలి. వీటిల్లో లోతైన విషయ పరిజ్ఞానం ఉంటుంది. ఎన్సీఈ ఆర్టీ, సీబీఎస్సీ ఇంటర్మీడియెట్ పుస్తకాలు.. రాష్ట్ర సిలబస్‌తో పోలిస్తే పోస్ట్‌గాడ్యుయేషన్ పుస్తకాలతో సమానం. ప్రతీ పాఠం తర్వాత పాఠానికి కొనసాగింపు ఉంటుంది. దీనివల్ల సబ్జెక్టుపై పట్టు వస్తుంది. ఫలితంగా గ్రూప్స్‌లో ఏ రూపంలో ప్రశ్న వచ్చినా తేలికగా సమాధానం ఇవ్వగలిగే సత్తా విద్యార్థులకు ఉంటుంది. ఆప్షన్స్ ఎంపిక ఎలా ఉండాలి? ఈ మధ్య గ్రూప్–2లో సోషల్ సబ్జెక్టు ఆప్షన్‌గా తీసుకున్న ఇంజనీరింగ్ విద్యార్థులే మంచి స్కోర్ సాధించారు. కొత్త సబ్జెక్టు అయితే, మూలాల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి లోతుగా అధ్యయనం చేసే విద్యార్థి ఆప్షన్ విషయంలో ఏది తీసుకున్నా మెరుగైన ఫలితాలే ఉంటాయి. సివిల్స్‌లో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. తక్కువ సమయంలో ప్రిపరేషన్ ఎలా? సాధ్యమే. రోజూ ఒక గంట ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి. ఆ తర్వాత దినపత్రికల్లో సంపాదకీయాలు చదవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రముఖ రచయితల పుస్తకాలు చదవాలి. పోటీ పరీక్షలకు గ్రూప్ డిస్కషన్స్ చాలా ముఖ్యం. ఈ తరహా చర్చల వల్ల లోతైన పరిజ్ఞానం అలవడే వీలుంది. నెల రోజులు సీరియస్‌గా చదివితే కోచింగ్ సెంటర్‌కు వెళ్లకుండానే గ్రూప్స్ కొలువు కొట్టొచ్చు. అలాగే, ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేయాలి. మానసిక ఒత్తిడిని జయించాలి. సమయపాలన చాలా ముఖ్యం. దీనిపై ప్రిపరేషన్ నుంచే దృష్టి పెట్టాలి. -
గుడ్‌న్యూస్: గ్రూప్ 1, గ్రూప్ 2 కు ఇంటర్వ్యూ మార్కులూ తొలగింపు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలకు స్వస్తి పలికిన రాష్ట్ర ప్రభుత్వం.. పరీక్షల్లో ఆ మేర మార్కులనూ తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటివరకు అన్ని పేపర్లతోపాటు ఇంటర్వ్యూ మార్కులు కలిపి ఉండే గరిష్ట మార్కులు ఉండగా.. ఇక ముందు కేవలం రాతపరీక్షల మొత్తమే గరిష్ట మార్కులు కానున్నాయి. ఈ క్రమంలో గ్రూప్–1 పరీక్ష మొత్తంగా 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్ష మొత్తంగా 600 మార్కులకే ఉండనున్నాయి. ఈ మేరకు నియామక సంస్థలు పరీక్షా విధానానికి సంబంధించిన ప్రక్రియను దాదాపు కొలిక్కి తీసుకువచ్చాయి. చదవండి👉వీఆర్ఏల ఆగం బతుకులు.. కార్లు కడుగుడు.. బట్టలు ఉతుకుడు రాతపరీక్షే ఆధారం.. గ్రూప్–1, గ్రూప్–2 కొలువులకు, వైద్యారోగ్య సంస్థల్లో మెడికల్ ఆఫీసర్, ఆపైస్థాయిలో నేరుగా చేపట్టే నియామకాలకు ఇంటర్వ్యూలు, గురుకుల విద్యాసంస్థల్లో బోధన పోస్టులకు సంబంధించి డెమో రౌండ్ ఇప్పటివరకు కీలకంగా ఉండేవి. నియామకాల్లో జాప్యాన్ని నివారించడం, అవకతవకలకు అవకాశం లేకుండా చేయడం కోసం వీటిని రద్దుచేసి, రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు దృష్టి సారించాయి. ఇంటర్వ్యూలను రద్దు చేయడంతోపాటు వాటికి సంబంధించిన మార్కులను కూడా తొలగిస్తేనే మంచిదన్న ప్రతిపాదన చేశాయి. దీనిపై తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. తగ్గనున్న మార్కులు ► ఇదివరకు గ్రూప్–1 పరీక్షను మొత్తంగా 1000 మార్కులకు నిర్వహించేవారు. అందులో 900 మార్కులకు వివిధ రాతపరీక్షలు, ఇంటర్వ్యూకు 100 మార్కులు ఉండేవి. ఇక గ్రూప్–2 పరీక్షను 675 మార్కులకు నిర్వహించగా.. అందులో 75 మార్కులు ఇంటర్వ్యూలకు ఉండేవి. ఇప్పుడు ఇంటర్వ్యూల మార్కులను తొలగిస్తే.. గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు, గ్రూప్–2 పరీక్షను 600 మార్కులకే నిర్వహించే అవకాశం ఉంది. ► ప్రస్తుతం గురుకుల విద్యాసంస్థల్లో పీజీటీ, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామకాల్లో రాతపరీక్షలతోపాటు డెమో (ప్రత్యక్ష బోధన పరీక్ష) ఉంది. ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలకు ఇంటర్వ్యూలను తొలగించడంతో డెమో విధానానికి స్వస్తి పలకాలని అధికారులు భావిస్తున్నారు. ► ఇప్పటివరకు వైద్యారోగ్య విభాగంలోని కొన్నిపోస్టులకు కేవలం ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు. ఈసారి ఆయా పోస్టుల నియామకాలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టడంపై బోర్డు కసరత్తు చేస్తోంది. సిలబస్‌లో మార్పులు లేనట్టే! ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పరీక్ష విధానంలో మార్పులు అనివార్యమయ్యాయి. అయితే పరీక్షల సిలబస్‌లో మార్పులు అవసరం లేదని నియామక సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూలు తొలగించినందున.. ఆయా సామర్థ్యాలకు సంబంధించిన అంశాలను రాతపరీక్షలో చేర్చే ప్రతిపాదన కూడా ఉంది. చదవండి👉 ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా! -
ఎస్సీ యువతకు ఉచితంగా గ్రూప్స్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలను ఎస్సీ యువత దక్కించు కునేలా కోచింగ్ సదుపాయం కల్పించాలని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎంపిక చేసిన ఎస్సీ యువతకు గ్రూప్–1, 2, 3, 4ల కోసం ఫౌండేషన్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి జిల్లాలో 75 మంది నుంచి 150 మందిని ఎంపిక చేసి వారికి 300 గంటల పాటు 33 కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రకటించింది. గ్రూప్–1 నుంచి గ్రూప్ –4 వరకు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఇండియన్ ఎకానమీ, కరెంట్ ఎఫైర్స్ సిలబస్‌లో 300 గంటల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందాలనుకునే యువత రూ.3 లక్షల వార్షిక ఆదాయానికి లోబడి ఉండాలని, ఈనెల 8న జిల్లాల వారీగా ఇచ్చే నోటిఫికేషన్‌తో శిక్షణ ప్రక్రియ మొదలవుతుందని స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం సమయంలో ఎంపికైన అభ్యర్థులకు భోజనం, టీ ఖర్చుల కోసం ప్రతిరోజు రూ.75 చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తామన్నారు. http://tsstudycircle.co.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ షెడ్యూల్ ఇలా.. ఈనెల 8న శిక్షణకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 9 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 19న అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. 20న మెరిట్ లిస్ట్‌ను డీఎస్సీడీవో కార్యాలయాల్లో పెట్టి, ఎంపికైన అభ్యర్థులకు ఫోన్ల ద్వారా సమాచారం అందిస్తారు. 22న అభ్యర్థుల అర్హత పత్రాలను వెరిఫికేషన్ చేసి, 25 నుంచి శిక్షణాæ తరగతులను ప్రారంభిస్తారు. -
గ్రూప్స్‌కు తొలగిన అడ్డంకులు.. త్వరలోనే నోటిఫికేషన్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, ఇతర కేటగిరీల్లోని దాదాపు 3 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం ఏయే పోస్టులు ఏయే జోన్లలో వస్తాయి, ఏయే పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది. పదేళ్ల తరువాత.. రాష్ట్రంలో కీలకమైన గ్రూప్-1 వంటి పోస్టులు జోన్ల సమస్యల కారణంగానే ఇన్నాళ్లుగా భర్తీకి నోచుకోలేదు. 2011లో చేపట్టిన గ్రూప్-1 నియామకాల తర్వాత ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీ చేపట్టలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక వీటితోపాటు గ్రూప్-2, 3 వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది. అయితే 2018లో అప్పటికే ఏర్పాటుచేసిన 31 జిల్లాలతో కూడిన జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలను ఏర్పాటు చేసింది. కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలు లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చినా.. న్యాయ వివాదాలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించారు. ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాలన్నీ చేరుస్తూ.. అప్పటికే 2018లో రాష్ట్రపతి ఆమోదం పొందిన ‘తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్) ఆర్డర్–2018’కు సవరణలు చేసింది. ములుగు, నారాయణపేట కొత్త జిల్లాలను చేర్చడంతోపాటు, జోగులాంబ జోన్లో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్‌జోన్‌కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. రాష్ట్రపతి దీనికి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర హోంశాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. పోస్టులను ఎప్పుడో గుర్తించినా.. తెలంగాణ ఏర్పాటయ్యాక తర్వాత ప్రభుత్వం రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్‌ను (టీఎస్పీఎస్సీ) ఏర్పాటు చేసింది. గ్రూప్-1, 2, 3 పోస్టులు, మల్టీ జోనల్ పోస్టుల భర్తీకి కసరత్తు చేసింది. సబ్జెక్టు నిపుణులతో కమిటీలను ఏర్పాటు చేసి సిలబస్‌ను రూపొందించింది. భర్తీకోసం గ్రూప్-1లో 142 పోస్టులను, గ్రూప్–2లో 60 పోస్టులను, గ్రూప్–3లో 400 వరకు పోస్టులను గుర్తించింది. మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోన్, జోనల్ పోస్టులు కలుపుకొని 3 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. శాఖల వారీగా పోస్టులు, రోస్టర్ తదితర వివరాలపై కసరత్తు కూడా జరిగింది. అయితే పాలనాపర సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. రాష్ట్రంలో జిల్లాలను తొలుత 31 జిల్లాలుగా విభజించింది. అప్పటివరకు ఉన్న 2 జోన్లను ఏడు జోన్లుగా, రెండు మల్టీ జోన్లు మార్చింది. దీంతో పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదం లభించినా.. కొత్తగా మరో రెండు జిల్లాల ఏర్పాటుతో మళ్లీ ఆగిపోయింది. మార్పులకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం రావడంతో పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. అప్పట్లో గుర్తించిన సుమారు 3 వేల పోస్టులతోపాటు ప్రస్తుత ఖాళీలను కలుపుకొంటే 4వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇవేకాకుండా ప్రభుత్వం భర్తీ చేయదలచిన 50 వేల ఉద్యోగాలకు కూడా కొత్త జోనల్ విధానాన్ని అమలు చేయనున్నారు. -
ఉద్యోగ పోటీ పరీక్షల్లో విజయం ఎలా?
మీరు డీగ్రీ పాసయ్యారా? ప్రభుత్వ ఉద్యోగం మీ కల? మీ కల నేరవేర్చుకుందాం అంటే కరోనా అడ్డుగా ఉందా! అయితే అచీవర్స్ అకాడమీలో చేరండి. కరోనా కాలంలో కూడా కాంపీటేటివ్కు ప్రీపేర్ అయ్యి మీ ప్రభుత్వ ఉద్యోగ కలను నెరవేర్చుకోండి! అయితే డీగ్రీ అయిపోయిన విద్యార్థులంతా తాను గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. కానీ ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అది అంత సాధ్యం కాదు. సరైనా ప్రణాళిక, అంకితభావం ఉంటే అది సుసాధ్యం అవుతుంది. అయితే చాలా మంది ఏళ్ల తరబడి పోటీ పరీక్షలకు చదువుతున్నప్పటికీ వారికి ఫలితం సున్నా. అయితే ఈ క్రింద 7 సుత్రాలను పాటిస్తే పోటీ పరీక్షల్లో విజయం మీదే అని చెబుతున్నారు అచీవర్స్ అకాడమీ నిపుణులు. ఏపీఎస్సీ, టీఎస్‌పీఎస్‌స్సీ పోటీ పరీక్షలకు సిద్దమవడానికి మీరు పాటించాల్సిన ఈ 7 సిద్దాంతాలను అచీవర్స్ అకాడమీ వారు మీ కోసం అందించారు. అవేంటో తెలుకుందాం రండి! ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పరీక్షలలో విజయం సాధించడం ఎలా? 1. మీరు ఏం చదువుకున్నారని కాదు, డిగ్రీపాస్ అయితే చాలు. మీరు చేయాల్సిందల్లా మొదటగా ఏ ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారో మీకు మీరు ఓ స్పష్టత తెచ్చుకోవాలి. నేను ఏ ఉద్యోగానికివెళ్తున్నాను? నోటిఫికేషన్ ఏవిధంగా పడింది? ఉద్యోగంపేరేంటి? ఇలా పూర్తిగా స్పష్టతతో ఉండాలి. 2. దానికిసంబందించిన సిలబస్‌ను పూర్తిగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ సిలబస్‌పై పట్టు సాదించాలి. 3. ఆ సిలబస్‌కు తగ్గట్టుగా సరైన పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. 4. తరువాత దీనికి సంబంధించిన ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ప్రముఖ కోచింగ్ సెంటర్ల గురించి తెలుసుకోవాలి. ఎటువంటి కోచింగ్ తీసుకోవాలి అనే దాని గురించి మొదట స్పష్టమైన అవగాహన ఉండాలి. APPSC Group 2 Online Coaching కావాలంటే Achievers Academy లాంటి కోచింగ్ సెంటర్లో చేరవచ్చు. 5. వీటన్నింటితో పాటు సిలబస్ గురించిన సమాచారాన్ని మైక్రోషీట్‌లో రెడీచేసుకోవాలి. మనకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నది తెలుసుకోవాలని, మరీ ముఖ్యంగా అందులోని సిలబస్ ఏంటి? అనే దానిపై మైక్రోషీట్ రెడీచేసుకోవాలి. ఈ మైక్రోషీట్తో నెల రోజు టైం టెబుల్‌ను సిద్దం చేసుకోండి. మీరు చదివే పోటీ పరీక్షలో ఉన్న సబ్జెక్స్ ఏంటో, ఎన్ని ఉన్నాయో వాటన్నింటిని మైక్రోషీట్‌లో రాసుకుంటే సిలబసపై తెలుసుకోవడం సులభతరం అవుతుంది. ఈ ప్రకారం 1వ తేదీ ఎన్నిపాఠాలు చదవాలి? అనేది నిర్ణయించుకోవాలి. ఉదాహారణకు 1వ తేదీన హిస్టరీలో రెండు పాఠాలు, ఎకనామిక్స్‌లో రెండు పాఠాలు ఇలా రాసుకుని ఆ రోజు ఎన్ని పాఠాలు పూర్తి చెయ్యాలో షీట్‌పై వేసుకునే టైంటేబుల్‌నే మైక్రోషీట్ అని పిలుస్తాం. అయితే సబ్జెక్టుపై మాత్రమే పట్టు సాధించినంత మాత్రాన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మార్కులు సాధించలేము. కాబట్టి అన్ని సబ్జెక్ట్స్లోను పట్టు సాధించాలి. దీనికోసం ఎక్కువ రోజులు కెటాయించకుండా కేవలం 10 రోజుల్లో సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలా మీ మైక్రో షీట్‌ను తయారు చేసుకోండి. మొత్తం 10 రోజులలో సబ్జెక్ట్స్ అన్ని పూర్తిగా చదవాలి. దీనిని ఫాస్ట్ రౌండ్ అని పిలుస్తాం. మరల 11 వ రోజు నుంచి 20వ రోజు వరకు దానిపై సెకండ్ రౌండ్ మొదలు పెట్టాలి. ఇలా నెలకు మూడు రౌండ్లు పూర్తవుతాయి. ఇలా 50 రోజులలో 5 రౌండ్లు చదవాలి. అప్పడే సిలబస్ మీద పట్టు వస్తుంది. 6. ఆన్లైన్లో మోడల్ పేపర్స్ అభ్యమౌవుతాయి. సాధ్యమైనన్ని ఎక్కువ పేపర్లను మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కవ పేపర్లు ప్రాక్టీస్ చేయ్యడం ద్వారా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 7. చివరి భాగం విజయమే. కాంపిటేటివ్ పరీక్షలలో ఈ ఏడూ సూత్రాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూపాటించాలి. ఇలా పాటించి అతితక్కువ సమయంలోనే అంటే 50 రోజులల్లోనే మీరు ఈ ప్రణాళికను పట్టుదలతో చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అయితే కొంత కాంపీటేటివ్కు ఎన్ని గంటలు చదవాలని కొంతమంది అడుగుతుంటారు. మీకు సబ్జేక్ట్పై పట్టులేకుండా ఎన్ని గంటలు చదివినా అది వృధా అవుతుంది. కాబట్టి ఎన్ని గంటలు చదవాలి అనేది ముఖ్యం కాదు. చదివిన కొద్ది పేపు సబ్జెక్ట్‌పై పట్టు వచ్చేలా చదవాలి. కాబట్టి పై సుత్రాలను పాటిస్టూ నిబద్ధతతో చదివితే మీరు కోరుకున్న ప్రభుత్వం మీ సొంతం అవుతుంది. ఇక త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. అంతేగాక ఇదే సిలబస్ కూడా ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, యూపీఎస్సీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఏ పరీక్షలకైనా మీరు పాటించాల్సిన సిద్దాంతాలు మాత్రమే ఇవే. పై 7 సూత్రాలను పాటిస్తూ చదివితే కాంపీటేటివ్లో తప్పకుండా విజయం సాధిస్తారు. చదువు అనేది ఎవరిసొత్తు కాదు, అది పేదవాడైన, ధనవంతుడైన ఒకేలాగా చదవాలి. కష్టపడితే తప్పకుండ విజయం వస్తుంది. విజయంసాదించాలి అంటే మొదటమనకు కావాల్సింది ఏంటంటే హార్డ్‌వర్క్. ఎవరూ కష్టపడుతారో వాళ్లదే తప్పని సరిగా విజయం అవుతుంది. చాలామంది విజయం ఏవిధంగా సాదించాలి? ఏ కోచింగ్ సెంటర్లలో చేరాలి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏమి చెయ్యాలి అని సందేహంలో ఉంటారు. అలాంటి వారికి సమాధానం అచీవర్స్ అకాడమీ మీ సందేహాలను తీర్చి మీమ్మల్ని కాంపిటేటివ్లో మందడుగు వేసేలా చేస్తుంది. అచీవర్స్ అకాడమీ ఆఫ్‌లైన్, ఆన్లైన్లోను క్లాస్‌లు నిర్వహిస్తోంది. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాలలోని వారికి కూడా అందుబాటులో ఉంచేందుకు అతి తక్కువ ఫీజుతో ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహిస్తోంది. రాష్ట్ర స్థాయిలోనే కాకుండా సెంట్రల్ స్థాయిలోని ప్రముఖులచే క్లాస్‌లు చెప్పించడం జరుగుతుంది. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేవారు ఆలస్యం చేయకుండా అచీవర్స్ అకాడమీ చేరీ మీ ప్రభుత్వం ఉద్యోగం కలను నెరవేర్చుకోండి. -
ప్రభుత్వ ఉద్యోగాలకు భోజన వసతితో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
గ్రూప్స్ కోసం వసతి, స్టయిఫండ్‌తో కూడిన ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 22వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 24న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్‌ను సంప్రదించగలరు. -
ఒక్క రూపాయి..
నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. దేన్నీ అపాత్రాధానం చేయకూడదని, వాటి విలువ పుచ్చుకునేవారికి తెలియాలనే ఉద్ధేశ్యంతో విద్యాదానమైనా, అన్నదానమైనా ఒక్క రూపాయి మాత్రమే తీసుకోవాలని తన శిష్యులకు ఉపదేశించారు. మరి వారి ఆశయాలను నెరవేర్చే శిష్యులు ఎంత మంది ఉన్నారో తెలియదు కానీ, ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోస్తుంది. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 6న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం టెట్, డీఎస్సీ తరగతులను జూలై 8న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
పాత పద్ధతిలోనే ‘గ్రూప్స్’ పరీక్షలు నిర్వహించాలి
దోమలగూడ: ప్రభుత్వం గ్రూప్–1, 2, 3 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు అన్లైన్లో కాకుండా పాత పద్ధతినే నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేదంటే సర్వీస్ కమిషన్ కార్యాలయన్ని ముట్టడించి చైర్మన్‌ను కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించారు. ఇందిరాపార్కు వద్ద ఏపీ, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిరుద్యోగులు ధర్నా చేశారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2కు మల్టీ సెషన్స్ పద్ధతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకించారు. దీని వల్ల ఐదేళ్లుగా పాత పద్ధతిలో సిద్ధమవుతున్న వారికి అన్యాయం జరుగుతుందన్నారు. సంస్కరణలు, మార్పులను రెండు, మూడేళ్ల ముందే ప్రకటించి, అభిప్రాయాలు సేకరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాత పద్ధతిలోనే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే విధానం పాటించాలని విజ్ఞప్తి చేశారు. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికలల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రెండున్న ఏళ్లలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా విడుదల చేయక పోవడం దారుణమైన మోసమని విమర్శించారు. ధర్నాలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాసు తదితరులు మాట్లాడారు.