ఎస్సీ యువతకు ఉచితంగా గ్రూప్స్‌ శిక్షణ | Groups‌ Training Free For SC Youth In Telangana | Sakshi
Sakshi News home page

ఎస్సీ యువతకు ఉచితంగా గ్రూప్స్‌ శిక్షణ

Published Thu, Apr 7 2022 1:47 AM | Last Updated on Thu, Apr 7 2022 1:47 AM

Groups‌ Training Free For SC Youth In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ ఉద్యోగాలను ఎస్సీ యువత దక్కించు కునేలా కోచింగ్‌ సదుపాయం కల్పించాలని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎంపిక చేసిన ఎస్సీ యువతకు గ్రూప్‌–1, 2, 3, 4ల కోసం ఫౌండేషన్‌ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రతి జిల్లాలో 75 మంది నుంచి 150 మందిని ఎంపిక చేసి వారికి 300 గంటల పాటు 33 కేంద్రాల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ ప్రకటించింది.

గ్రూప్‌–1 నుంచి గ్రూప్‌ –4 వరకు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే వారికి అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, పాలిటీ, జియోగ్రఫీ, ఇండియన్‌ హిస్టరీ, తెలంగాణ మూవ్‌మెంట్, ఇండియన్‌ ఎకానమీ, కరెంట్‌ ఎఫైర్స్‌ సిలబస్‌లో 300 గంటల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పొందాలనుకునే యువత రూ.3 లక్షల వార్షిక ఆదాయానికి లోబడి ఉండాలని, ఈనెల 8న జిల్లాల వారీగా ఇచ్చే నోటిఫికేషన్‌తో శిక్షణ ప్రక్రియ మొదలవుతుందని స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ వెల్లడించారు. శిక్షణ కార్యక్రమం సమయంలో ఎంపికైన అభ్యర్థులకు భోజనం, టీ ఖర్చుల కోసం ప్రతిరోజు రూ.75 చెల్లించనున్నట్లు తెలిపారు. రూ.1,500 విలువైన స్టడీ మెటీరియల్‌ కూడా అందజేస్తామన్నారు. http://tsstudycircle.co.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

శిక్షణ షెడ్యూల్‌ ఇలా..
ఈనెల 8న శిక్షణకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. 9 నుంచి 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. 19న అభ్యర్థులు డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. 20న మెరిట్‌ లిస్ట్‌ను డీఎస్‌సీడీవో కార్యాలయాల్లో పెట్టి, ఎంపికైన అభ్యర్థులకు ఫోన్‌ల ద్వారా సమాచారం అందిస్తారు. 22న అభ్యర్థుల అర్హత పత్రాలను వెరిఫికేషన్‌ చేసి, 25 నుంచి శిక్షణాæ తరగతులను ప్రారంభిస్తారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement