పుష్కరాల బాట
నేటి నుంచి వరుస సెలవులు
రాజమండ్రి ప్రయాణాల జోరు
పోటెత్తుతున్న రైల్వే స్టేషన్
కిటకిటలాడుతున్న రైళ్లు
ఆలస్యంగా నడుస్తున్న వైనం
విశాఖపట్నం సిటీః రైళ్లన్నీ కిటకిట లాడుతున్నాయి. ఏ రైలూ కాస్త ఖాళీగా కనిపించడం లేదు. ఇటు గోదావరి పుష్కరాలు..అటు పూరీ జగన్నాథ రధయాత్ర కు వెళ్లేవారితో విశాఖ రైల్వేస్టేషన్ మునుపెన్నడూ లేనంత రద్దీగా కనిపిస్తోంది. నాలుగయిదు రోజులుగా ఇదే పరిస్థితి.దీనికితోడు శని, ఆదివారాలు సెలవులు కావడంతో రైలు ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. విద్యాలయాలకు సోమ, మంగళవారాలు సెలవులు ప్రకటించడంతో అంతా ప్రయాణాల బాట పట్టారు. శుక్రవారం రైల్వే స్టేషన్ ఒక్క సారిగా కిటకిటలాడింది. క్యూ లైన్లన్నీ నిండిపోయాయి.
సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వేల మంది మాత్రమే రోజుకు జనరల్ ప్రయాణికులు టికె ట్లు తీసుకుంటారు. రిజర్వేషన్, ఇతర స్టేషన్‌లలో తీసుకున్న టికెట్లతో లెక్కిస్తే రోజుకు లక్ష మందికి పైగా విశాఖ నుంచి బయల్దేరిన ట్టు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ముగిసే కొద్దీ మరింత రద్దీ పెరిగేలా ఉందని రైల్వే వర్గాలంటున్నాయి. గత సోమవారం నుంచి శుక్రవారం వరకూ విశాఖ నుంచి రాజమండ్రికి బయల్దేరిన వారు 5 లక్షల మందికిపైగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. పుష్కరాల సందర్భంగా వాల్తేరు రైల్వే ప్రవేశపెట్టిన 12 రైళ్లతో పాటు 40కు పైగా రెగ్యులర్ రైళ్లు రాజమండ్రికి నిత్యం వెళుతుండడంతో ప్రయాణికులంతా ఈ రైళ్లను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నారు. అన్ని రైళ్లకూ 100 నుంచి వెయ్యి మంది చొప్పున బయల్దేరుతున్నారని రైల్వే వర్గాలు అంటున్నాయి.
రైళ్లన్నీ 3 నుంచి 5 గంటలు ఆలస్యంః
-పుష్కర రద్దీ కారణంగా రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు దూర ప్రాంతాల నుంచి ఎక్కువ రైళ్లు నడుపుతుండడంతో ట్రాక్ ఖాళీ లేక ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపివేస్తున్నారు. ముఖ్యంగా ప్రతీ రైలు రాజమండ్రిలో చోటు కోసం నిరీక్షించడంతో ఈ సమస్య తలెత్తినట్టు రైల్వే అధికారిక వర్గాలు అంటున్నాయి. గురువారం అర్ధరాత్రి నుంచీ రైళ్ల ఆలస్యం కొనసాగుతోంది. ఎప్పుడూ 12 గంటలకు విశాఖ స్టేషన్‌కు వచ్చి 12.30 గంటలకు బయల్దేరే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు వచ్చి తిరిగి 5 గంటలకు బయల్దేరి వెళ్లింది. ఠంచనుగా తెల్లవారి 6 గంటలకు విశాఖకు చేరుకునే గోదావరి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8 గంటలకు, 7 గంటలకు చేరుకునే విశాఖ ఎక్స్‌ప్రెస్ 9.30 గంటలకు విశాఖకు చేరుకున్నాయి. విశాఖ నుంచి బయల్దేరాల్సిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్ భారీ ఆలస్యంతో నడుస్తుంది. ఈ రైలు విశాఖకు చేరుకునేందుకు ఆలస్యం కావడంతో ప్రత్యేక రైళ్లు కూడా ఎప్పుడు బయల్దేరతాయో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ైరె ళ్లన్నీ ఆలస్యంగా చేరుకోవడం, బయల్దేరడం జరుగుతోంది. ప్రతీ రైలు కనీసం రెండు గంటల నుంచి గరిష్టంగా 5 గంటల వరకూ ఆలస్యంగా ఉన్నట్టు రైల్వే వర్గాలు తెలిపాయి.
పెరిగిన ప్రయాణికులు ఇలా..!
12-7-2015 26,000
13-7-2015 52,000
14-7-2015 46,000
15-7-2015 49,000
16-7-2015 52,000
17-7-2015 60,000