లింగాలఘణపురం, న్యూస్‌లైన్ : రెవెన్యూ గ్రామాల నుంచి నూతన పంచాయతీలుగా ఏర్పడిన గ్రామాలు అన్యాయూనికి గురవుతున్నారుు. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో లక్షలాది రూపాయల ఆదాయం రావాల్సిన పంచాయతీలకు పైసా కూడా రావడం లేదు. ఇంటి, నల్లా పన్ను, ఆస్తి మార్పిడితో పాటు పంచాయతీల పరిధిలో భూముల క్రయవిక్రయాల్లో రిజిస్ట్రేషన్ ఫీజులో కొంత శాతం గ్రామ పంచాయతీలకు జమవుతుంది. వీటితో ఆయా గ్రామా ల్లో నెలకొన్న సమస్యలను తీర్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఆదాయ వనరులు కేవలం రెవెన్యూ గ్రామాలకే జమ కావడంతో... నూతనంగా ఏర్పడిన పంచాయతీల పరిస్థితి అధ్వానం గా తయారైంది. వసూలు చేసిన పన్నులు పంచాయతీ సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నారుు.
జిల్లావాప్తంగా ఇదే పరిస్థితి
జిల్లాలో1098 రెవెన్యూ గ్రామాలుండగా... 962 గ్రామ పంచాయితీలున్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఉదాహరణకు లింగాలఘణపురం మండలం తీసుకుంటే.. ఇందులో 14 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామ పంచాయితీలున్నాయి. వీటిలో కళ్లెం రెవెన్యూ పరిధిలో మాణిక్యాపురం, నెల్లుట్ల పరిధిలో పటేల్‌గూడెం, లింగాలఘణపురం పరిధిలో బండ్లగూడెం, వడిచర్ల రెవెన్యూ పరిధిలో నవాబుపేట గ్రామాలున్నాయి. 1994లో కళ్లెం రెవెన్యూ పరిధిలోని మాణిక్యాపురం విడిపోయిది...
రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద నూతన గ్రామపంచాయతీకి రావాల్సిన ఒక్క పైసా అప్పటి నుంచి ఇప్పటివరకు నూతన పంచాయతీకి రాలేదు. జనగామ రెవెన్యూ డివిజన్‌కు దగ్గరగా ఉన్న మాణిక్యాపురం పరిధిలో వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. కానీ... రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కింద వచ్చిన లక్షలాది రూపాయలు కళ్లెం రెవెన్యూ పంచాయతీలోనే జమ అవుతున్నాయి. 1981లో నెల్లుట్ల నుంచి ఏర్పడిన పటేల్‌గూడెం పంచాయతీ పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.