నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీకి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.50 లక్షలు విడుదలయ్యాయి. ఇదే మండలంలోని ఇనమడుగు పంచాయతీకి రూ.3.90 లక్షలు, రాపూరు మండలంలోని పంగి లి అనే చిన్నపంచాయతీకి రూ.1.04 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులతో తమ సమస్యలను కొంత వరకైనా పరిష్కరిస్తారని ఆశించిన గ్రామీణులకు నిరాశ ఎదురైంది. నిధులు విడుదలై నెలరోజులు కావస్తున్నా ఖర్చు చేసుకునేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదని సర్పంచ్‌లు చెబుతున్నారు. సర్పం చ్‌లకు శిక్షణ పూర్తి కాలేదని పంచాయతీ కార్యదర్శులు అంటున్నారు. ఇలా స ర్పంచ్‌లు, కార్యదర్శులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్నారే తప్ప నిధులతో ప్ర జలకు ఉపయోగపడే పనులు చేసేం దుకు ఆలోచించడం లేదు. ఈ దుస్థితి జిల్లాలోని 940 పంచాయతీల్లో నెలకొం ది. పంచాయతీలకు రూ.14 కోట్లు మంజూరైనా ఇప్పటి వరకు ఒక్క రూ పాయి కూడా ఖర్చు చేయలేదంటే పల్లె పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థమవుతోంది.
కొరవడిన పర్యవేక్షణ
గత నెల్లో కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. అయితే ఖర్చు చేసేందుకు సర్పంచ్‌లకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, వీధిదీపాలు, మురుగు తదితర సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అపరిశుభ్రత కారణంగా గ్రామాల్లో డెంగీ, చికున్‌గున్యా, వైరల్‌ఫీవర్ లాంటివి విజృంభిస్తున్నాయి. గ్రామీణులు వివిధ సమస్యల చట్రంలో ఇరుక్కుని విలవిలలాడుతున్నారు. డీపీఓ జితేంద్ర, డీఎల్పీలు పర్యవేక్షించకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.
931 పంచాయతీలకు ఎన్నికలు
జిల్లాలో 940 పంచాయతీలున్నాయి. వీటిలో 931 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వెంకటగిరి సమీపంలోని 7 పంచాయతీలను మున్సిపాలిటీలో కలపాలని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అక్కడ ఎన్నికలు నిర్వహించలేదు. ఈ ఏడు గ్రామాల్లో ఇప్పటికీ ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. విడవలూరు మండలంలోని రామచంద్రాపురం, ఏఎస్‌పేటలోని పెద్దబ్బీపురం గ్రామాల్లో స్థానిక కారణాల రీత్యా ప్రజలు ఎన్నికల్లో పాల్గొనలేదు. మొత్తం 940 గ్రామాల్లో 20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
13వ ఆర్థిక సంఘం
నిధులు రూ.14 కోట్లు విడుదల
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయి ఐదు నెలలు కావస్తోంది. సమైక్య సమ్మెతో రెండునెలలు పాలనకు ఆటం కం ఏర్పడింది. ఆ తర్వాత కొంత ఆల స్యంగా నవంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటు తలసరిగ్రాంటు, సీనరేజి, వృత్తి పన్నులు కలిపి జిల్లాలోని 940 పంచాయతీలకు రూ.14 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు 2011 -12 సంవత్సరానికి సంబంధించి గతంలో ఆగిపోయిన రెండో క్వార్టర్‌వి. 2012-13 సంవత్సరంలో ఎన్నికలు జరగని కారణంగా నిధులు విడుదల కాలేదు. 2013-14కు సంబంధించిన నిధులు రావాల్సి ఉంది.
పాత బకాయి నిధులు ఇప్పుడు విడుదలైనా సర్పంచ్ లు కనీసం రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం విమర్శలకు తావిస్తోం ది. ఖర్చు చేసే విధానంపై తమకు మా ర్గదర్శకాలు అందలేదని సర్పంచ్‌లు వా పోతున్నారు. మరోవైపు పంచాయతీ కార్యదర్శులు సహకరించడం లేదని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. ఖర్చు చేయడంలో ప్రభుత్వ గైడ్‌లైన్స్‌లో లోపాలున్నాయని, అందుకే కొంత ఆలస్యమవుతోందని కార్యదర్శులు వాపోతున్నారు.
పల్లెల్లో పడకేసిన పాలన
Published Wed, Dec 11 2013 3:15 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement