ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలు మభ్యపెడుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసత్య ప్రచారాలతో ప్రజలు మభ్యపెడుతోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ఉన్నది లేనట్టు.. లేదని ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే చేసినట్టు లీకులిచ్చి టీడీపీ సర్కారు వార్తలు రాయించుకుందని ఆరోపించారు.
18 అంశాలపై సర్వే చేస్తే కనీసం మూడో వంతు ప్రజలు కూడా సంతృప్తిగా లేరని వెల్లడించారు. అన్నింటిలో వైఫల్యం చెందిన అడ్డగోలు లెక్కలు వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. మోసపుచ్చే సర్వేలు మానుకుని ప్రజలకు మంచి పనులు చేయాలని హితవు పలికారు.