కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాలలోని మహానందీశ్వర ఆలయ సమీపంలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 32 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.