
మట్టినీ మింగేస్తున్నారు...!
ఎర్రచందనం కోసం తమిళ స్మగ్ల ర్లు శేషాచల కొండల్లో చెలరేగిపోతుంటే.. ఇసుక తయారీ కోసం కర్ణాటక ముఠా పలమనేరు చెరువు ల్లో పాగా వేస్తోంది.
=ఇసుక తయారీ కోసం ఫిల్టర్ పాయింట్లు
=జోరుగా కర్ణాటక ముఠా కార్యకలాపాలు
=10 వేల లోడ్ల చెరువు మట్టి అక్రమార్కుల పాలు
ఎర్రచందనం కోసం తమిళ స్మగ్ల ర్లు శేషాచల కొండల్లో చెలరేగిపోతుంటే.. ఇసుక తయారీ కోసం కర్ణాటక ముఠా పలమనేరు చెరువు ల్లో పాగా వేస్తోంది. ఎక్కడికక్కడ గోతులు తీస్తూ మట్టిని తరలిస్తోం ది. అధికారుల నిర్లక్ష్యమే వారికి కాసుల వర్షం కురిపిస్తోంది.
పలమనేరు/బెరైడ్డిపల్లె న్యూస్‌లైన్: బంకమన్నుతో ఇసుకను తయారు చేసే కర్ణాటక ముఠా పలమనేరు నియోజకవర్గంపై పడింది. వీరి పాలిట బంకమన్ను తెల్ల బంగారంగా మారిం ది. నియోజకవర్గ సరిహద్దు మండలాల్లో బంకమన్నుతో ఇసుక తయారు చేసే ఫిల్టర్ పాయిం ట్లు అధికమయ్యాయి. కర్ణాటకకు చెందిన ఈ ముఠా స్థానిక కూలీలను లోబరచుకొని తమ పని కానిచ్చేస్తోంది.
నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో దాదాపు 60 చెరువులు ఇప్పటికే నాశనమయ్యాయి. సుమారు 10 వేల నుంచి 20 వేల లోడ్ల బంకమన్ను ఈ చెరువుల నుంచి ఖాళీ అయింది. రెవెన్యూ, మైనింగ్ అధికారు లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఇదో ఎడారిగా మారుతుంది. స్థానిక రైతులు ఎవరైనా చెరువు నుంచి ట్రాక్టర్ బంకమట్టిని తరలిస్తే హల్‌చల్ చేసే రెవిన్యూ అధికారులు వేలాది లోడ్ల బంకమన్ను తరలుతున్నా ఎందుకు పట్టించుకోవ డంలేదని సామాన్యులు సైతం ప్రశ్నిస్తున్నారు.
బంకమన్ను నుంచి ఇసుక తయారీ..
మూడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రంలోని ములబాగల్ ప్రాంతంలో ఇసుక తయారీ విధానం ప్రారంభమైంది. ఇసుక తయారీ కోసం అక్కడి చెరువుల్లో బంకమట్టిని పూర్తిగా తోడేశారు. దీంతో వీరి కన్ను పలమనేరు ప్రాంతంపై పడింది. బెరైడ్డిపల్లె మండలంలోని ఆలప్పల్లె పంచాయతీ, గంగవరం మండలంలోని గుండుగల్లు పంచాయతీ, పెద్దపంజాణి మండలంలోని అప్పినపల్లె, శంకర్రాయలపేట పం చాయతీ పరిధిలో ఇసుక తయారు చేసే ఫిల్టర్ పాయింట్లను నెలకొల్పారు. ఎంపిక చేసిన ప్రాంతానికి చెరువుమట్టిని డంప్ చేస్తున్నారు. ప్రత్యేకమైన జల్లెడ ద్వారా బంకమట్టిని నీటితో క్యూరింగ్ చేస్తూ ఇసుకను తయారు చేస్తున్నా రు. ఈ ప్రక్రియతో రెండు లోడ్ల బంకమట్టి నుంచి ఓ లోడ్డు ఇసుక తయారవుతోంది. అయితే చెరువుల్లోని ఒండ్రుమట్టిని మాత్రమే ఇందుకు వినియోగించాలి.
మూడు మండలాల్లో 60 చెరువులు నాశనం
బెరైడ్డిపల్లె మండలంలోని మునిరాజపురం, ఆలప్పల్లె, జంబుగండ్లపల్లె, కవ్వంపల్లె, దాసార్లపల్లె, లక్కనపల్లె, మురారిపల్లె, గంగవరం మండలంలోని గుండుగల్లు ప్రాంతం, పెద్దపంజాణి మండలంలోని మాడిచెరువుతో పాటు 60 చెరువుల్లో బంకమట్టిని కర్ణాటక ముఠా అ క్రమంగా తరలించారు. ఇప్పటిదాకా 20 వేల లోడ్ల ఒండ్రుమట్టిని తరలించినట్టు అక్కడి పరిస్థితిని బట్టి తెలుస్తోంది.
ఖర్చు రూ. 200.. లాభం రూ.1000
ఈ ప్రాంతంలోని చెరువుల్లో నుంచి రెండు ట్రా క్టర్ లోడ్ల బంకమట్టిని తరలించాలంటే రవాణకు అయ్యే ఖర్చు రూ. 200 మాత్రమే. రెండు లోడ్ల మట్టి నుంచి ఓ లోడ్డు ఇసుక తయారవుతోంది. ఈ ప్రాంతంలో ట్రాక్టర్ ఇసుక రూ. 1200గా ఉంది. ఆ లెక్కన రూ. 200 ఖర్చు పోయినా రూ.1000 మిగులుతోంది. ఇదో లాభసాటి వ్యాపారంగా మారడంతో కర్ణాటక కు చెందిన ఇసుక మాఫీయా ఈ ప్రాంతంలో ఫిల్టర్ పాయింట్లు పెట్టి ఇప్పటికే లక్షలు గడించారని తెలుస్తోంది.
కర్ణాటక ముఠా వలలో గ్రామీణ కూలీలు
ఉపాధి పనులు చేస్తే రోజుకు రూ.100 మాత్ర మే గిట్టుబాటు అవుతుండడంతో ఇక్కడి కూలీ లంతా ఇసుక తయారీ పనులకు వెళ్తున్నారు. కర్ణాటకకు చెందిన ముఠా వీరికి ముందుగానే భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చి పనులు చేయించుకుంటోంది. రోజుకు ఓ కూలీకి రూ. 300గా నిర్ణయించారు.
వారిని చూసి వీరు..
కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తులు ఇక్కడి చెరువుల్లోని బంకమట్టితో ఫిల్టర్ పాయింట్ల ద్వారా లక్షలు సంపాదిస్తుండడంతో స్థానికులు సైతం ఇసుక తయారీపై దృష్టి సారించారు. దీంతో ఈ ప్రాంతంలో ఫిల్టర్ పాయింట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అధికారులు బంకమట్టి రవాణాను అడ్డుకోకుంటే చెరువు ఉనికి ప్రశ్నార్ధకంగా మారడం ఖాయం.
పట్టించుకోని అధికారులు..
వేలాది లోడ్ల ఇసుక తరలిపోతున్నా అటు రెవిన్యూ, ఇటు మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటకకు చెందిన ఇసుక మాఫియా సంబంధి త మండలాల్లోని అధికారులకు నెల మామూళ్లను భారీగానే సమర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలోని చెరువుమట్టి కర్ణాటక స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ విషయైమై బెరైడ్డిపల్లె మండల తహశీల్దార్ రాజేశ్వరరావ్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఫిల్టర్ పాయింట్ల విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. విచార ణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని ఆయ న పేర్కొన్నారు.