కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1005 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు లారీలు, ఓ కారు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.