
చీపురుపల్లిలో గ్యాస్ లొల్లి
సీఎస్‌ఆర్ పథకం ద్వారా తక్కువ ధరకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి దొరికినంత దోచుకున్నారు భారత్ గ్యాస్ డీలర్లు.
విజయనగరం జిల్లా: సీఎస్‌ఆర్ పథకం ద్వారా తక్కువ ధరకే గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్న కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి దొరికినంత దోచుకున్నారు భారత్ గ్యాస్ డీలర్లు. ఇందుకు విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదికైంది. సీఎస్‌ఆర్ పథకం ద్వారా అర్హులైన వారందరు 'మీ సేవ'లో రూ. 10 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందేందుకు కలెక్టర్ మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేశారు.
అందుకు గానూ లబ్ధిదారులు రూ.1500 చెల్లించి గ్యాస్ సిలిండర్, పైపు, రెగ్యులేటర్‌ను అందిస్తారు. అయితే, భారత్ గ్యాస్ డీలర్లు మాత్రం కలెక్టర్ ఆదేశాలకు విరుద్ధంగా సుమారు 2,800 మంది లబ్ధిదారుల నుంచి రూ.3,100, రూ. 3,500 చొప్పున వసూలు చేశారు. మోసపోయిన లబ్ధిదారులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఫిర్యాదు చేసేందుకు గురువారం మధ్యాహ్నం వచ్చారు. కాగా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన లబ్ధిదారులపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేయడం విశేషం. దీన్ని బట్టి చూస్తే అధికార టీడీపీ వర్గాలకు కూడా ఈ గ్యాస్ కనెక్షన్తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.
(చీపురుపల్లి)