నాగర్‌కర్నూల్/వనపర్తి టౌన్, న్యూస్‌లైన్: రూపా యి పతనం సామాన్య జన జీవితం పై, కార్మిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ వివరించారు. ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాల కారణంగా రూపాయి విలువ పడిపోతుందని, ఫలితంగా పెట్రో ల్ నుంచి పప్పు దినుసుల వరకు ప్రతి వస్తువు దిగుమతిపై పన్నులరూపంలో భారం పడుందన్నారు. నాగర్‌కర్నూల్ పట్టణంలోని పీఆర్ అతిథిగృహంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం ‘రూపాయి విలువ పతనం.. కారణాలు.. పరిష్కారాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రధానవక్తగా పాల్గొన్నారు.
ఇదే అంశంపై వనపర్తి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నాగేశ్వర్ ప్రసంగించారు. రూపా యి పతనంతో తమకు సంబంధం లేదన్నట్లు పలువురు భావిస్తుంటారని, అది సరికాదన్నారు. పతనం వల్ల రూపాయి విలువ తగ్గి ధరలు పెరుగుతాయని, బయ టి దేశాల నుంచి ముడిసరుకు దిగుమతి చేసుకున్నప్పుడు ఎక్కువ డబ్బు చెల్లించా ల్సి వస్తుం దన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గుతుందని, తద్వారా కంపెనీల ఉత్పత్తులు మార్కెట్ కాక కంపెనీలు దివాలాతీసి మూ తపడతాయని, కార్మికులు జీవనోపాధి కోల్పోతారని వివరించారు. బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు ప్రకటిస్తూ యూపీఏ-2 ప్రభుత్వం పేదవాడి నడ్డివిరి చే విధానాలు అవలంభిస్తుందని విమర్శించారు. ఆర్థిక సంస్కరణల వల్ల దేశీయ ఉత్పత్తులు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. విలాసవంతమైన వస్తువులకు రాయితీలు ఇస్తున్నారని, సామాన్యుడిని పట్టించుకోవడం లేదని ఆక్షేపించారు. రూపాయి విలువ దిగజారుతున్న కొద్దీ చమురు ధర పెరిగి, పెట్రోల్, డీజీల్‌ధరల మీద ప్రభావం చూపుతున్నాయన్నారు. విమానానికి వాడే ఇంధనంపై 16 శాతం పన్ను వేస్తే సామాన్యులు తిరిగే ఆర్టీసీపై 23 శాతం పన్ను వేస్తున్నారని వివరించా రు. ప్రభుత్వ పథకాలకు వడ్డీరేట్లు తక్కువగా ఉండటం వల్ల అందరూ బంగారుపై పెట్టుబడులు పెడుతున్నారని వివరించా రు. అదే అమెరికా కేవలం 240 టన్నుల బంగారం దిగుమతి చేసుకుందన్నారు. దీం తో రూపాయికి బదులుగా డాలర్లు చెల్లిం చాల్సి వచ్చిందన్నారు.
కాకినాడలో ఉత్పత్తి అయ్యే గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను 2002 లో రిలయన్స్ సంస్థ రూ.4 ఒక యూనిట్ అమ్మితే ఇప్పుడు యూనిట్ విలువ రూ.12 రూపాయిలకు పెంచిందన్నారు. ఈ వ్య త్యాన్ని భర్తీచేసేందుకు ప్రభుత్వం ప్రజల నుంచే పన్నులు రాబడుతోందని వివరిం చారు. పాలమూరు జిల్లాలో ఉన్న పెండిగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.రెండు లక్షల కోట్లు ఇస్తే రైతులకు పంటలు బాగా పండి ఫలితంగా వారి కొ నుగోలు శక్తి పెరుగుతుందన్నారు. కార్యక్రమాల్లో ఆర్.శ్రీనువాసులు, యూటీఎఫ్ నాయకులు వహీద్‌ఖాన్, రామకృష్ణ, ప్రవీణ్, గీత, వీ రాంజనేయులు, భరత్, రామయ్య, రవిప్రసాద్, బాలగోవింద్, శ్రీనివాసులు గౌడ్, వీరాంజనేయులు, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
రూపాయి పతనం..ప్రభుత్వ పాపమే
Published Mon, Sep 23 2013 2:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM
Advertisement
Advertisement