గిరిబాబుకు కన్నీటి వీడ్కోలు
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన పాలిటెక్నిక్ విద్యార్థి పిల్లి గిరిబాబు అంతిమయూత్ర నగ రంలో తెలంగాణ వాదుల అశ్రునయనాల మధ్య సాగింది. సంపూర్ణ తెలంగాణ కావాలంటూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్ డిప్లొమా సెకండియర్ చదువుతున్న పిల్లి గిరిబాబు(18) బుధవారం సాయంత్రం పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.
ఆయన భౌతికకాయూనికి గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిం చారు. అనంతరం ఎంజీఎం నుంచి గిరిబాబు అంతిమయాత్ర ప్రారంభమై పాలిటెక్నిక్ వరకు సాగింది. జై తెలంగాణ... జైజై తెలంగాణ ... అమర్ రహే.. గిరిబాబు.. నీ త్యాగం వృథా కాదు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఎంజీఎం జంక్షన్‌లో తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించారు. అక్కడున్న టీడీపీ జెండా గద్దెను ధ్వంసం చేసేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జెండా గద్దెకు ఉన్న టీడీపీ జెండాను ద హనం చేసి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.
గిరిబాబుకు నివాళులు అర్పించిన వారిలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితా యూదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ హకీం నవీద్, ప్రిన్సిపాల్ శంకర్, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నీలం రాజ్‌కిషోర్, అధ్యాపకులు బూరం అభినవ్, వై. కృష్ణ, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్, ముశం శ్రీనివాస్, ఏఐఎస్‌ఎఫ్, ఏబీవీపీ, టీ ఆర్‌ఎస్‌వీ, డీఎస్‌యూ నాయకులు ఉన్నారు. అంతిమయాత్రకు వందిలాదిగా విద్యార్థులు తరలివచ్చారు.
దహన సంస్కారాలకు హాజరైన విద్యార్థులు..
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురంలో గిరిబాబు అంత్యక్రియల్లో అతడి సహచర విద్యార్థులు పాల్గొన్నారు. తమ స్నేహితుడు తమ నుంచి విడిపోతున్నాడని దుఃఖసాగరంలో మునిగిపోయారు. తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మేకల అక్షయ్ కుమార్ బృందం హాజరయ్యారు.
రూమ్‌లో సూసైడ్‌నోట్
గిరిబాబు ఉంటున్న రూమ్‌లో బుధవారం రాత్రి పోలీ సులు తనిఖీ చేయగా సూసైడ్‌నోట్ లభించిం ది. అరుుతే ఆ లేఖను గోప్యంగా ఉంచారు. అందులో ‘నా కోటి రత్నల వీణ నా తెలంగాణ. 60 యేళ్ల పోరాటంలో మిగిలింది ఏమిటి చావులు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఓ తెలంగాణ యువకుడా ఇకనైనా ఏలుకో... నాకు ఎంతో బాధగా ఉంది. నేను పెద్దవాడిని అయ్యాక పోలీసునై అమ్మాయిల మీద అరాచాకాలను అపుదాం అనుకున్న.. నా చావుతో అయినా సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి. అన్నయ్య, అమ్మా, నాన్న సారీ. అన్న య్యూ.. అమ్మ,నాన్నకు నేను లేని లోటు తీర్చు. పాలిటెక్నిక్ ఫ్రెండ్స్ సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆపకండి. ప్రిన్సిపాల్ సార్ దయచేసి కోఆపరేట్ చేయండి.. ఇంక పదేళ్లు హైదరాబాద్ ఎందుకు కావాలి. ఇంక ఎంత దోచుకపోతారు’ అని లేఖలో పేర్కొన్నాడు.