బాలిక కిడ్నాప్.. ఆపై లైంగికదాడి | Girl kidnapped | Sakshi
Sakshi News home page

బాలిక కిడ్నాప్.. ఆపై లైంగికదాడి

Published Tue, Aug 20 2013 7:20 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

Girl kidnapped

కారంచేడు, న్యూస్‌లైన్ : పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి మైనర్‌ను బలవతంగా కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చీరాల రూరల్ సీఐ ఫిరోజ్, స్థానిక ఎస్సై నఫీజ్‌బాషా కథనం ప్రకారం.. మండలంలోని కుంకలమర్రుకు చెందిన సయ్యద్ బాలబాషా అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానంటూ ఏడాది నుంచి వెంటపడుతూ వేధిస్తున్నాడు. బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పాఠశాల మాన్పించారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్న బాలబాషా ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయనగరం జిల్లా పిట్లాడ గ్రామంలో ఉన్న తన స్నేహితుని వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలబాషాకు మూడు నెలల క్రితమే వివాహమైందని తెలుసుకుని తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో వారు వెళ్లి బాలికను గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై మైనర్ కిడ్నాప్, నిర్భయ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు సీఐ, ఎస్సైలు వివరించారు. నిందితుని కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
 
 వారంలో రెండో కేసు
 కారంచేడు పోలీసుస్టేషన్‌లో వారంలో నిర్భయ కేసలు రెండు నమోదయ్యాయి. కారంచేడులో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన జి.గోపీపై ఇదివరకే నిర్భయ చట్టం కేసు నమోదు చేశారు. వారంలోనే రెండో నిర్భయ కేసు సయ్యద్ బాలబాషాపై నమోదు కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలతో బాలికల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ ఇలాంటి కేసులు నమోదు కాకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement