కడప : కడప నగరం కోటిరెడ్డి సర్కిల్‌లోని మలబార్ గోల్డ్ దుకాణంలో 180 బంగారు నాణేలు చోరీ అయ్యాయి. ఈమేరకు మలబార్ గోల్డ్ మేనేజర్ షంషీర్ బుధవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 138 గ్రాముల బరువుగల వీటి విలువ 3.5లక్షల రూపాయలు ఉంటుందని ఆయన తెలిపారు. వన్ టౌన్ సీఐ రమేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.