
సోనియా గాంధీకి తెలంగాణపై జిఓఎం నివేదిక
న్యూఢిల్లీ: యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కేంద్ర మంత్రుల బృందం(జిఓఎం) తెలంగాణపై ఒక నివేదిక సమర్పించింది. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, జయరామ్, ఎకె ఆంటోనీ సోనియాతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిగ్విజయ్ సింగ్, చిదంబరం కూడా పాల్గొనే అవకాశం ఉంది. కేంద్ర మంత్రుల బృందం ఇంతకాలం కసరత్తు చేసిన తయారు చేసిన నివేదికను ఆమెకు అందజేశారు.
సమావేశంలో ప్రధానంగా తెలంగాణ అంశం చర్చిస్తారు. తెలంగాణ బిల్లు డ్రాప్ట్కు తుది రూపం ఇచ్చే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి జిఓఎం తుది సమావేశం జరుగనుంది. ఆ రోజు నివేదిక తుదిరూపం దాల్చుతుంది. అందు కోసం సోనియా గాంధీ సూచనలు, సలహాలు ఇస్తారు.